ప్రస్తుతం టాలీవుడ్ లో జగపతి బాబు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు. విలన్ గా మంచి పారితోషికం తీసుకుంటున్నారు కాబట్టి జగపతి బాబు బాగానే సంపాదిస్తున్నారు. కానీ జగపతి బాబు ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఆస్తుల విషయంలో జగపతి బాబు చిరంజీవి, నాగార్జున లాంటి టాప్ హీరోల స్థాయిలో ఉండాల్సింది. ఒకప్పుడు అంతలా సంపాదించారు కూడా. అయితే 2010 తర్వాత జగపతిబాబు మార్కెట్ భారీగా దెబ్బతింది. ఆయన చిత్రాలు ఆడలేదు. ఒక దశలో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
జగపతిబాబుకు వారసత్వంగా భారీగా ఆస్తులు వచ్చాయి. సుదీర్ఘ కెరీర్లో ఆయన కూడా సంపాదించారు. ఈ ఆస్తులు మొత్తం ఆవిరయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు తనకు కూడా వెయ్యి కోట్ల ఆస్తి వరకు ఉండేదని ఒప్పుకున్నారు. అది ఎలా పోయిందో కూడా తెలియజేశారు. నాకు ఆర్థిక నిర్వహణ తెలియదు. డబ్బులు ఎలా సంపాదించాలి. సంపాదించిన దాన్ని ఎలా కూడబెట్టాలనే విషయాలపై అవగాహన లేదు. నేను అసలు పట్టించుకోను. నా ఆస్తులు పోవడానికి జూదం, ఆడవాళ్లకు ఖర్చు చేయడం అనుకుంటారు.
అది నిజం కాదు. నేను క్యాసినోకి వెళతాను. జూదం ఆడతాను. కేవలం అది నాకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. దాని వలన కోట్లు పోలేదు. నేను కొందరిని నమ్మాను. దాన్ని మోసం చేయడం అంటారో వాడు కోవడం అంటారో నాకు తెలియదు. ఖర్చు చేయడం వలన కొంత, అడిగినవారికి ఇవ్వడం వలన కొంత పోగొట్టుకున్నాను. ఇదంతా నా అసమర్థత వలనే జరిగింది. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టను. ఆస్తులు పోయాక నా భార్య పిల్లలకు నేను ఒకటే చెప్పాను. ఒక 30 కోట్ల రూపాయలు ఉంటే మనం హ్యాపీగా బ్రతికేయవచ్చు. కాబట్టి అది నేను సంపాదించగలను.
అంతకంటే ఎక్కువ వస్తే బోనస్. ఒక రూ. 30 కోట్లు సంపాదిస్తే దాన్ని రూ. 300 కోట్లు చేయాలి అనుకోను. ఎక్కువ సంపాదించినా మనశ్శాంతి ఉండదు. విలన్ అయ్యాక నేను బాగానే సంపాదిస్తున్నారు. లెజెండ్ మూవీతో జగపతిబాబు విలన్ గా టర్న్ తీసుకున్నారు. ఈ మూవీ హిట్ కావడంతో జగపతిబాబుకు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సైతం జగపతిబాబు బిజీ. రోజుకు జగపతిబాబు రూ. 10 లక్షలు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా చేయగలడు.