ఏపీలో ఉచిత కరెంట్..రూ.1 కట్టక్కర్లేదు. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.

divyaamedia@gmail.com
2 Min Read

తేలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల అసంతృప్తితో పాటు.. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను ప్రతీ ఒక్కటివ అమలు చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో ముఖ్యంగా.. ఎక్కువగా పాపులర్ అయిన పథకాలు ఫ్రీ బస్ ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు ఉన్నాయి. అయితే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు కూడా టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.

అయితే కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన పథకాన్నితీసుకువచ్చింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన వారికి సబ్సిడీ రేటుకే సోలార్ పవర్ సిస్టమ్‌ను ఇంటిపై ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఉచితంగానే కరెంట్ లభించినట్లు అవుతుంది. అయితే సబ్సిడీ అనేది పూర్తిగా రాదు. ప్రజలు కొంత మొత్తం చేతి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇలా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విద్యుత్ వినియోగించుకోవచ్చు.

అయితే ఇలా సబ్సిడీ భారం లేకుండా ఎస్సీ, ఎస్టీ ప్రజలకు పూర్తిగా 100 శాతం సబ్సిడీతో సోలార్ స్కీమ్ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే విజయనగరం, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు సర్వే కూడా నిర్వహించారు. అంటే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పూర్తి ఉచితంగానే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. అర్హత కలిగిన వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయ్యింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విద్యుత్ అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు.

తూర్పు ప్రాంత విద్యుత్త పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ఐదు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 7 లక్షలకు పైగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. వీటిల్లో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు అనువైన ఇళ్లను గుర్తిస్తున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభిస్తోంది. ఇలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఇంకా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వం వీరి నుంచే పొందొచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *