కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్, కానీ చివరి రోజుల్లో ఆమె పడిన కష్టాలు తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

శ్రీవిద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో 14 ఏళ్లకే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది శ్రీవిద్య. శివాజీ గణేశన్ సరసన ‘తిరువరుట్చెల్వన్’ సినిమాతో శ్రీవిద్య తమిళ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. అయితే సినీరంగుల ప్రపంచంలో అందాల కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ సినీతార జీవితంలో విధి ముఖ్య పాత్ర పోషించింది. శ్రీవిద్య ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ML వసంత కుమారి కుమార్తె. శ్రీవిద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి కృష్ణమూర్తి యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ శ్రీవిద్య తల్లి ఎంఎల్ వసంతకుమారి చూసుకోవాల్సి వచ్చింది.

నటి శ్రీవిద్య 14 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక సంక్షోభంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. శివాజీ గణేశన్ నటించిన తిరువరుట్‌చెల్వన్‌ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పెద్దరాశి పెద్దమ్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. దర్శకుడు దాసరి నారయణరావు ప్రోత్సాహంతో ఆమె ఎన్నో చిత్రాల్లో కథానాయికగా అలరించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ జోడిగా కనిపించింది. దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకాంత్, కమల్ హాసన్ తో కలిసి నటించింది.

ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అప్పట్లో కమల్, శ్రీవిధ్య కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ కమల్, శ్రీవిధ్య పెళ్లికి ఆమె తల్లి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి ప్రేమ బంధం మధ్యలోనే ముగిసిపోయింది. ఆ తర్వాత శ్రీవిద్య 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ని పెళ్లాడింది. వివాహానంతరం భర్త కోరిక మేరకు సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె జీవితం మలుపుతిరిగింది. ఆమె ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆర్థిక సమస్యలు ప్రారంభం కావడంతో మరోసారి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత సినీ పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీవిద్య.. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ లో మెరిసింది. 2003లో శ్రీవిద్య అనారోగ్య సమస్యలతో బాధపడింది. కేన్సర్‌ బారిన పడిన ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సంగీత, నృత్య కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు తన ఆస్తి మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్టార్ నటీనటులతో విరాళాలు సేకరించి పేద విద్యార్థులకు అందించింది. 2006లో 53 ఏళ్ల వయసులో శ్రీవిద్య మరణించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *