పెళ్లైన 12 ఏళ్లకు తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోలు వైరల్ కావడంతో..!

divyaamedia@gmail.com
2 Min Read

రాధికా ఆప్టే బ్రిటీష్ సంగీత స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుని సుమారు 12 సంవత్సరాలు అయ్యింది. రాధికా ఆప్టే ఆమె భర్త తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్ లో బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందీ అందాల తార. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాధిక ‘BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’ నుంచి తన ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికాకు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధిక నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ UKలో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆమె బ్లాక్ ఆఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్ తో అందంగా కనిపించింది. అదే సమయంలో బేబీ బంప్ తో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆమెకు విషెస్ తో ముంచెత్తారు.

రాధిక బ్రిటీష్ వయోలిన్ విద్వాంసుడు, స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను 2012లో వివాహం చేసుకుంది. ఉత్తర ఇంగ్లండ్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. సినిమాలతో బిజీ బిజీగ ఉండే రాధిక తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో లేదా మీడియా ముందు పెద్దగా చెప్పదు.

అయితే ఒక సందర్భంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది.. ‘ 10 సంవత్సరాల క్రితం (ఇప్పటికీ 12 ఏళ్లు) బెనెడిక్ట్, నేను వివాహం చేసుకున్నప్పుడు, మేము ఫోటోలు కూడా తీసుకోలేదు.మా పెళ్లికి కేవలం స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాం, మేము మేమే భోజనాలు తయారు చేశాం. పెళ్లి తర్వాత మేము పార్టీ చేసుకున్నాము. మా స్నేహితులు చాలా మంది ఫోటోగ్రాఫర్లు అయినప్పటికీ, ఎవరూ ఫోటోలు తీయలేదు’ అని రాధికా చెప్పుకొచ్చింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *