ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకొనేవాడు, ఈ ఆత్మ ఇతరులచేత చంపబడుతుంది అని అనుకొనేవాడు. ఈ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. అయితే వ్యక్తి మరణిస్తే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తుంది. కానీ, కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని వీడేందుకు ఆస్కారం ఉండదు. బాడీని వదిలి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ ప్రాసెస్‌ని ‘డెత్ హ్యాంగింగ్’ అని అంటారట. అయితే, శరీరాన్ని విడిచిపెట్టడానికి ఆత్మ నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణమని పురాణాలు చెబుతున్నాయి. శరీరాన్ని విడిచి వెళ్లాలంటే ఆత్మ సంతృప్తి చెంది ఉండాలి. చేయాల్సిన కర్మలన్నీ పూర్తి చేశాకే ఆత్మ సంతృప్తి చెందుతుంది.
లేకపోతే, శరీరానికి, ఆత్మకు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఫలితంగా సదరు వ్యక్తి తీవ్ర అవస్థలు పడతాడు. కఠోపనిషత్, గరుడ పురాణం ప్రకారం.. శరీరం నుంచి ఆత్మ విడిపోయేటప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయి. చనిపోవడానికి 72 గంటల ముందు నుంచే వ్యక్తి ముఖంలో మార్పులు వస్తాయి. దీంతో ముఖ కవలికలు పూర్తిగా మారిపోయి మృత్యువుకు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తాయి. కళ్లు పూర్తిగా తెరుచుకోకపోవడం, నోటి నుంచి శ్వాస తీసుకోవడం, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమయంలో శరీరం అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. భౌతికంగా జరిగే మార్పులను వీరు గమనించలేరు.
తనను తీసుకెళ్లడానికి తమ పూర్వీకులు వచ్చారని, తనతో మాట్లాడుతున్నారని చాలా మంది చెబుతుంటారు. పైగా, మరణం దగ్గరవుతున్న కొద్దీ బంధ విముక్తులు అవుతున్నట్లు అనిపిస్తోందని, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని అంటుంటారు. శరీరం నుంచి ఆత్మ విడిచి వెళ్లేందుకు కొన్ని మార్గాలుంటాయి. పురాణాల ప్రకారం.. మూలాధార చక్రం నుంచి ఆత్మ బయటకు వెళుతుంది. అంటే, కాలి బొటనవేళ్ల నుంచి ఆత్మ శరీరాన్ని విడిపోతుంది. అందుకే, మరణించిన తర్వాత కాలి బొటనవేళ్లను కలిపి కడతారు. ఇలా కట్టకుంటే ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుందనే విశ్వాసం ఉంది.
మరికొంత మందికి ఆత్మ తలపై నుంచి బయటకు వెళుతుంది. అందుకే, కొందరు నోరు తెరిచి మరణించడం, మరికొందరు కళ్లు తెరిచి ప్రాణాలు విడవడం చేస్తారు. ఈజిప్టు రాజులు మరణించినప్పుడు ఆత్మ సులువుగా వీడేందుకు వారి శరీరాన్ని నూనెలో ఉంచేవారట. శరీరాన్ని వదిలి వెళ్లేందుకు ఆత్మ నిరాకరించేటప్పుడు సంఘర్షణ ఎక్కువగా ఉంటుందట. చేయాల్సిన పనులు పెండింగులో ఉంటే ఆత్మ వెళ్లదు. ఆత్మ ఘోష మరీ ఎక్కువగా ఉంటే మళ్లీ శరీరంలోకి తిరిగి ప్రవేశించేందుకు ట్రై చేస్తుంది. ఆ శరీరం ఫిట్‌గా ఉన్నా, లేకపోయినా బాడీ ద్వారానే మిగతా కర్మలను పూర్తిచేస్తుంది.