పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే, నేటికీ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో విడాకుల రేటు తక్కువగా ఉంది. నేటికీ భారతదేశంలో చాలా మంది ప్రజలు వివాహాన్ని ఏడు జన్మల సంబంధంగా భావిస్తారు. భారతదేశంలో విడాకుల రేటు దాదాపు 1.1%. ఇది మొత్తం ప్రపంచంలోనే అతి తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అత్యధిక సంఖ్యలో విడాకులు దాఖలు చేస్తారు. కానీ భారతదేశంలో చిత్రం తారుమారైంది.
భారతదేశంలో చాలా విడాకులు పురుషులు దాఖలు చేస్తున్నారు. అయితే విడాకులకు ముఖ్య కారణం.. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు పెట్టుకున్న అంచనాలు పెళ్లి తర్వాత నెరవేరకపోవడమే అని డాక్టర్ పేర్కొన్నారు. నేటి యువత సోషల్ మీడియా ప్రపంచంలో జీవిస్తున్నట్లు అది కూడా విడాకులకు కారణం అని సైకాలజిస్ట్ తెలిపారు. పూర్వం భార్యభర్తలు ఒకరికొకరు సమయం ఇచ్చిపుచ్చుకునేవారని.. కానీ ఈ రోజుల్లో అలా కుదరడం లేదని చెబుతున్నారు.
ఉరుకుల పరుగుల జీవితానికి తోడు సెల్ ఫోన్ కూడా భార్యభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తోందని పూర్వీ భీమాని తెలిపారు. ఇక మరో కారణం బంధువులకు అనుగుణంగా లేకపోవటం, కలల ప్రపంచంలో జీవించడానికి ఖర్చులు భరించకపోవటం. ఈ విషయాలన్నీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తాయి. విభేదాలు గొడవలకు దారితీస్తాయి. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరుగుతుంటాయని డా. పూర్వీ భీమానీ తెలిపారు. భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పట్టించుకోవడం లేదన్నారు.
ఈ విషయంలో ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటూ విడాకుల వరకు వెళ్తున్నట్లు డాక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవటానికి, విడాకుల సమస్యను నివారించడానికి భార్యాభర్తలు కలిసి పనిని పంచుకోవాలి. తద్వారా ఎవరికీ భారం పడదు. అన్ని రకాల అంచనాలు, కలలు నెరవేరే జీవితమంతా జీవించడానికి ఉంది. అందువల్ల విడాకులు లేదా విడిపోవడం వంటి పదాలకు భార్యభర్తలు దూరంగా ఉంటే మంచిదన్నారు.