గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

divyaamedia@gmail.com
2 Min Read

అప్పు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ డబ్బు అవసరమైనప్పుడు చేసే పని. అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ సులభంగా డబ్బు పొందడానికి మార్గాలు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మాత్రమే మీరు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ పొందవచ్చు. అయితే గోల్డ్ లోన్ తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. అయితే అసలే బంగారం రేట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎంతో కొంత ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న మధ్యతరగతి సాదాసీద జనాలు అవసరానికి ఎక్కడ అప్పు చేయకుండా బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులలో పెట్టి రుణం తీసుకుంటుంటే వారు చేసే మోసాలు అంతా ఇంతా కాదు.

దిమ్మ తిరిగే ఘటన రీసెంట్‌గా అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషను పరిధిలో జరిగింది. ఓ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులపై మంగళవారం కేసు నమోదైంది. అనంతపురం గ్రామీణంలోని ఆకుతోటపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి గంగాధర్… నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని కీర్తన గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో ఈ ఏడాది ఏప్రిల్ 20న రెండు దఫాలుగా 336 గ్రాముల బంగారాన్ని తనఖా పెట్టాడు. మొత్తం రూ.18,71,682లు రుణం తీసుకున్నాడు. ఈ రుణంలో రూ.13,11,976కు సంబంధించి జులై 10న రూ.35 వేలు వడ్డీ చెల్లించాడు. మిగతా రుణానికి చెల్లించలేదు. ఫైనాన్స్ ప్రతినిధులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బంగారాన్ని వేలం వేశారు.

ఈ విషయంపై బాధితుడు లబోదిబోమంటు సంస్థ ఉద్యోగులను సంప్రదించినప్పటికీ స్పందించలేదు. పోలీసులను ఆశ్రయించాడు. రుణానికి వడ్డీ చెల్లించినప్పటికీ ఆభరణాలను వేలం వేసి తనను మోసం చేశారని బాధితుడు గంగాధర్.. ఫైనాన్స్ మేనేజర్ నారాయణ నాయక్, సేల్స్ మేనేజర్ లక్ష్మీప్రసాద్‌లపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, ఈ లోన్స్ అన్నిటికీ భిన్నమైనది గోల్డ్ లోన్…. మిగతా లోన్లకి బంగారు లోన్ కి చాలా డిఫెరెన్స్ ఉంది. మిగతా లోన్స్ మన సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్ ఇస్తారు లేదా ఇన్కమ్ ఉంటేనే ఇస్తారు. బంగారం లోన్ అలా కాదు మన దగ్గర బంగారం ఉంటే చాలు సిబిల్ స్కోర్ తో పనిలేదు.

జనరల్‌గా మనము లోన్లు తీసుకుంటే రీపేమెంట్ అనేది ఫైవ్ ఇయర్స్ లేదా రెండు సంవత్సరాలలో టెన్యూర్ పెట్టుకున్నామంటే ఈఎంఐ కట్టేసిన తర్వాత జీరో అయిపోయిన తర్వాత లోన్ క్లియర్ అవుతుంది. గోల్డ్ లోన్ లో అలా కాదు కేవలం నెల నెల వడ్డీ రూపంలోనే ఈఎంఐ కట్టుకోవచ్చు. డబ్బులు ఎప్పుడూ అయినా ఒకటేసారి సింగల్ పేమెంట్ తో లోన్ క్లియర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం తోనో లేక తొందరగా డబ్బులు చేతికొస్తాయి అనే ఉద్దేశంతోనో ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి అత్యవసర పరిస్థితుల్లో వారి అవసరంకోసం బంగారం పెట్టి లోన్ తీసుకుంటారు చాలామంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *