నేటి కాలంలో ప్రజలు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు. వివిధ రకాల పురాతన నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్షల రూపాయలు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన ఐదు రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు. ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాతనోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో 786 నెంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువుంది. ఈ నోట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అరుదైన నోటుగా గుర్తించింది.
లాక్‌డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం. ఇలాంటి ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోట్లు ఉంటే ఆన్‌లైన్‌లోనే అమ్ముకోవచ్చు. ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి coinbazzar.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు. ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సెల్‌లో ఉంచవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. అయితే ఇలాంటి నోట్లకు వేలు, లక్షల్లో విలువు ఉంటుంది. ఈ నోటే కాకుండా పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు.
అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు. అయితే ప్రస్తుతం పాత నోట్లు ప్రస్తుతం దేశంలో చెలామణిలో లేవు. కానీ వాటిని ఆన్‌లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు. ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బి.సి. రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటును coinbazzar.comలో 16,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. 1957 లో గవర్నర్ హెచ్‌ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ల కట్ట 45 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నోట్ యొక్క సిరీస్ 123456 గా ఉంది. అలాగే ఎస్.కె. వెంకటరమణ సంతకం చేసిన 500 రూపాయల పాత నోటు ఆన్‌లైన్‌లో 1.55 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ నోట్స్ క్రమసంఖ్య 1616 తో మొదలవుతుంది.
అలాగే ఎరుపు రంగులో ముద్రించిన 10 రూపాయల నోటును ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో 20 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీని క్రమ సంఖ్య 155863 గా ఉంది. అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం.. వెబ్‌సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకాన్ని ప్రచారం చేస్తోంది. అయితే పాత నాణేలను, నోట్లను జమ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంత మంది ఆంగ్ల కాలం నాటి నోట్లు, నాణేలను జమ చేస్తుంటారు. కొంత మంది స్వాతంత్ర్య కాలం నాటి ఈ పాత నోట్లను, నాణేలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే సాధారణంగా వీటికోసం ఎంతైనా చెల్లించేందుకు కొందరు ముందుకు వస్తుంటారు. అందుకే కాయిన్‌బజార్ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు.