1996లో తన మరణానికి ముందు బాబా వంగా చెప్పిన జోస్యం ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. వచ్చే ఏడాది అంటే 2025లో ప్రపంచంలో విధ్వంసం మొదలవుతుందని వెంగా చెప్పడంతో మానవాళి అంతం గురించి అతని విశ్వాసులలో ఆందోళన పెరిగింది. అయితే బాబా వంగ అసలు పేరు.. వాంజెలియా పాండేవా గుష్టెరోవా. ఆమె 9/11 ఉగ్రదాడులు, 2022లో యూకేలో సంభవించిన వరదలను ముందుగానే పసిగట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. దీంతో పలు ఉపత్తులను, ముందుగానే పసిగట్టడంతో ఆమె మాటలకు, ఊహాగానాలకు బలం చేకూరాయి. 2025లో ఐరోపా ఖండంలో ఒక సంఘర్షణ పుట్టుకొస్తుందని, ఆ సంఘర్షణ కారణంగా వేలాది మంది మరణిస్తారు తెలిపారు.
అక్కడి నుంచే ప్రపంచం అంతానికి అసలైన బీజం పడుతుందని, అదే యుగాంతానికి కారణమయ్యే అవకాశముందని తెలిపింది. 2028లో భూమి మీద ఉన్న వనరులు ముగిసే సమయం ఆసన్నమైందని గ్రహించిన మానవులు శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారని, అయితే ఆ గ్రహంపై వాతావరణం అనుకూలించకపోవడంతో అది జరగదని పేర్కొన్నారు. 2033.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంవత్సరమని, ఈ సంవత్సరం.. ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లోని మంచు గడ్డలు కరిగి.. సముద్రంలో పడతాయని, తద్వారా సముద్రపు మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశముందన్నారు.
2076లో కమ్యూనిజం తిరిగి వస్తుందని వంగా బాబా అంచనా వేశారు. అయితే ఈసారి కేవలం సోవియట్ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఇది విస్తరిస్తుందని అన్నారు. 2130 నాటికి మనం గ్రహాంతర వాసులతో పరిచయం పెంచుకోబోతున్నామని, ఇది మానవ మనుగడను మరొక స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. 2170 సంవత్సరం నాటికి భూమిపైనా వాతావరణం మొత్తం కలుషితమవుతుందని, తద్వారా భూగ్రహం మొత్తం కరువు తాండవిస్తుంది అన్నారు.
3005 సంవత్సరంలో మానవులకు, గ్రహాంతర వాసులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని, వారితో యుద్ధానికి మానవులు అంగారక గ్రహానికి వెళ్తారని చెప్పారు 3797వ సంవత్సరం నాటికి భూగ్రహం మీద మానవులు ఉండరని, వారు వేరే గ్రహానికి వెళ్తారని చెప్పారు. భూమి మీద వాతావరణం నాశనం అవడంతో పాటు.. కరువు తాండవిస్తుండడంతో వారు వేరే గ్రహానికి వెళ్ళాక తప్పదన్నారు. 5079వ సంవత్సరంలో ఈ యుగం ముగుస్తుందని, ఆ సంవత్సరంతో ప్రపంచం మొత్తం అంతం అవుతుందని, మానవ మనుగడే ఈ విశ్వంలో ఉందని స్పష్టం చేశారు.