కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగతో జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు, ఆమె ఆరోగ్య పరిస్థితి పై..!

divyaamedia@gmail.com
2 Min Read

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జైళ్లో ఉన్న బెంగతో బీబీజాన్ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆమెకు గుండెపోటు రావటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం గుండె పోటుకు వచ్చింది.

దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లి నేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి ఆయేషా ఆస్పత్రికి వచ్చారు. తన అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. బీబీ జాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి రంగా రెడ్డి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవలే దీనిపై వాదనలు విన్న రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు జానీ బెయిల్​పిటిషన్‌ ఈ నెల 14 కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే 2022 గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్​ఎంపికయ్యారు. పురష్కారాన్ని ఈ నెల 8న దిల్లీలోని విజ్ఞాన్​భవన్​లో అందిస్తామని జానీ మాస్టర్​కు ఆహ్వానం కూడా అందింది. దీంతో ఈ అవార్డు అందుకోవడానికి జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ​ఫిల్మ్​అవార్డు కమిటీ ప్రకటించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *