టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ టాటా వారసుడెవరనే దానిపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడింది. అవివాహితుడైన రతన్ టాటా అక్టోబర్ పదిన మరణించారు. ఆయన తన వీలునామాలో వారసుడెవరనేది రాయలేదు. అయితే టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చాడు రతన్ టాటా. ఎంత సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం. సంపన్న కుటుంబంలో పుట్టినా సామాన్యుడిలా జీవించారు. లగ్జరీ లైఫ్ కు ఆమడ దూరంలో ఉంటూ నిరాడంబర జీవితాన్ని గడిపారు. సామాజిక సేవాకార్యక్రమాలతో దాతృత్వానికి ప్రతీకగా నిలిచారు.
వేల కోట్ల రూపాయలను సేవ కోసం ఉపయోగించారు. విద్యా, వైద్యం, ఉపాధికోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మరణంతో వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరు? ఆయన ఆస్తులు ఎవరి సొంతం అవుతాయి? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ రతన్ టాటా వీలునామాలో ఏం రాశారు? ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి అన్న విషయం తెలిసిందే. ఆయన ఓ యువతిని ప్రేమించినప్పటికీ అది విఫలమైపోయింది. దీంతో ఆయన లైఫ్ లోకి మరో అమ్మాయి రాలేదు.
దీంతో రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. రతన్ టాటా అవివాహితుడు కావడంతో ఆయనకు సొంత పిల్లలు లేరు. దీంతో రతన్ టాటా వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, రతన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆయన సవతి సోదరుడి పిల్లలు వారసులవరుతారని తెలుస్తోంది. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1940లో వీరు విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా.. సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. అతని కుమారుల్లో ఒకరి పేరు నోయెల్ టాటా. ఆయనకు ముగ్గురు పిల్లలు మయా టాటా, నెవిల్లే టాటా, లీ టాటా ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలంటే రతన్ టాటాకు ఇష్టమట. వారికి ఇదివరకే చాలా రకాలుగా సహాయం చేశారట.
ఆ పిల్లలు కూడా రతన్ టాటాను బాగా చూసుకునేవారట. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా తన వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వీలునామా రాసినట్లు తెలుస్తోంది. ఆస్తులు ఎవరికి చెందాలో వీలునామాలో తెలిపినట్లు సమాచారం. రతన్ టాటా సంపదలో 30 శాతం కుటుంబానికి చెందేటట్లు రాసినట్లు తెలుస్తోంది. మిగతా సొమ్ము సేవ చేసే ట్రస్టులకు చెందేలా వీలునామా రాసినట్లు వెల్లడవుతోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలను సేవాకార్యక్రమాల కోసం వెచ్చించిన రతన్ టాటా వీలునామాలో కూడా సింహభాగం ట్రస్టులకే చెందేలా రాశాడని తెలియడంతో దేశమంతా అభినందిస్తోంది.