ప్రభుత్వం సంచలన నిర్ణయం. భారీగా రేషన్ కార్డుల రద్దు, మీ కార్డ్ ఉందో లేదో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

తెల్ల రేషన్‌కార్డుల్లో సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అనర్హుల రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి. పేర్లు తొలగిస్తున్నారు. అందువల్ల మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే.. ఆ కార్డు ఉందా? లేదంటే పేర్లు తొలగించారా? అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డుల నుంచి అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరణించిన వారి పేర్లు, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన వారి పేర్లు, స్థానికంగా లేనటు వంటి వారి పేర్లు తొలగిస్తున్నారు.

వీరికి బియ్యం పంపిణీ నిలిపి వేయాల్సిందిగా ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రతి నెలా డీలర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ అనర్హులను గుర్తిస్తూ వస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమాలను అడ్డుకోవాలనే లక్ష్యంతో అనర్హులకు బియ్యం పంపిణీ నిలిపి వేసేలా ప్రభుత్వం అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో గత ఫిబ్రవరిలో 9,78,595 రేషన్‌ కార్డులు ఉండగా 28,13,951 మంది లబ్ధిదారులు ఉన్నారు. అదే అక్టోబరు వచ్చే సరికి 9,77,409 రేషన్‌ కార్డుల్లో 28,08,132 మంది లబ్ధిదారులున్నారు. అంటే ఇక్కడ కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే 1,186 రేషన్‌ కార్డులను రద్దు చేసేశారు.

వీటిల్లో 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు. ప్రాంతాల వారీగా చూస్తే.. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 1075 రేషన్‌ కార్డులు రద్దు చేశఆరు. 4192 మంది పేర్లు తొలగించారు. ఇక జగిత్యాలలో 787 మంది, పెద్దపల్లిలో 406 మంది, రాజన్న సిరిసిల్లలో 434 మంది పేర్లు తొలగించారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. తొలగించిన వారిలో కొందరు అర్హులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొంటున్నారు. కాగా రేషన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ ఇకేవైసీ చేసుకోకపోతే వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి తొలగిస్తారు. డిసెంబరు 31 వరకు ఇకేవైసీ చేసుకోవచ్చు.

తర్వాత నుంచి పేర్లు తొలగిపోతాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,08,132 లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 24,61,248 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. పలు రకాల కారణాల వల్ల 3,46,884 మంది ఈ-కేవైసీకి ఇంకా చేసుకోలేదు. అంటే వీళ్లందరి కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబరు 31లోపు రేషన్‌ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడు డీలర్లను సంప్రదించి ఈ-కేవైసీ ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలని కరీంనగర్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింగరావు తెలిపారు. లేకపోతే బియ్యంతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించే విషయంలో సమస్యలు రావొచ్చని పేర్కొన్నారు. అందువల్ల మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *