కడలి కెరటంలో సిల్క్ స్మిత ఎంత వేగంగా ఆకాశానికి ఎగిరిందో.. అంతే వేగంగా నేలను తాకింది. సిల్క్ స్మిత ప్రస్తుతం బతికి ఉంటే… నూరేళ్లు జీవితాన్ని ఆస్వాదించాల్సిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడింది. అయితే విజయలక్ష్మి వడ్లపాటి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. అదే సిల్క్ స్మిత అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారు ఉండరు. వెండి తెరను ఊపేసిన నటి ఆవిడ. ఆమె డేట్స్ దొరికితే చాలు అని 90స్ లో స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. మత్తెక్కించే కళ్లు, నాజూకు వయ్యారంతో.. తను ప్రేక్షకులను అందాల దేవతగా అలరించింది.
ఎంత త్వరగా స్టార్‌గా ఎదిగిందో..అంతే త్వరగా పడిపోయింది సిల్స్ స్మిత. ఆమె జీవిత కథాశంతో డర్టీ పిక్చర్ అనే మూవీ తెరకెక్కింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తన మార్క్ చూపిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీనే. ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయని ఇప్పుటికీ ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. అయితే సిల్క్ స్మిత ఫ్రెండ్.. కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఆమె మరణానికి ముందు రోజు జరిగిన కొన్ని సంఘటనలు బాహ్య ప్రపంచంతో పంచుకున్నారు. 1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే మూవీలో నటించారు.
అప్పట్నుంచే వీళ్లు మంచి మిత్రులు అయ్యారు. ఆమె చనిపోయే ముందు వరకు కూడా వీరి ఫ్రెండ్షిప్ కొనసాగింది. స్మిత తనతో ఎంతో గౌవరం ఇచ్చేవారని… అలాగే తానూ ఆమె పట్ల గౌరవంతో ఉండేవాడినని వెల్లడించాడు రవి. సిల్క్ స్మిత చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పుకొచ్చాడు ఈ నటుడు. ఆమె ఒత్తిడిలో తనను కలవాలని ట్రై చేసిందేమో కానీ.. అది వీలుపడలేదని గుర్తు చేసుకున్నాడు. ఓ చిత్ర చిత్రీకరణలో ఉన్నందుకు కాల్ లిఫ్ట్ చేయలేకపోయానని.. లేకపోతే దారుణం జరిగి ఉండకపోయేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అదేదో రెగ్యులర్ కాల్ అనుకున్నానని.. అందుకే మళ్లీ రిటన్ చెయ్యలేదని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు ఫోన్ చేసిందని.. ఆ తర్వాత రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్. సిల్క్ స్మిత చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని.. ఆ కాల్ లిఫ్ట్ చేయలేదనే రిగ్రెట్ తనను ఎల్లప్పుడూ వెంటాడుతుందని ఓ సందర్భంలో రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.