నిజానికి బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరిగాయి ఏకంగా ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి పోల్చినట్లయితే బంగారం ధర ప్రస్తుతం దాదాపు 800 రూపాయలు తగ్గింది. అయితే బంగారం ధరలు స్వల్ప రిలీఫ్ ఇవ్వడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే పండుగ ఏదొచ్చినా.. శుభకార్యం ఏదైనా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే.
ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మదుపరులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత రెండు రోజులుగా తగ్గుతూవస్తోన్న బంగారం ధర.. శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 76,630లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా నమోదైంది.
ఇటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,780గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,390గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,630గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా కొనసాగుతోంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.
శుక్రవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 93,900లుగా నిలిచింది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 93,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 99,900గా కొనసాగుతోంది. అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 84,900గా ఉంది.