సోనియా గత వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత నెగిటివిటీ నడిచింది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ప్రవర్తన విమర్శలపాలైంది. తోటి కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన కామెంట్స్, యాటిట్యూడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ క్రమంలో సోనియాకు ఓట్లు పడలేదు. సోనియా తిరిగి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే బిగ్బాస్ సీజన్ 8 మొన్నటివరకు రసవత్తరంగా సాగింది. గొడవలు, అలకలు, ముచ్చట్లు, పంతాలు ఇలా ఒక్కటేమిటీ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించారు.
కానీ ఈ వారం అసలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా.. అడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. కానీ ఈవారం మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అలాగే ఈ వీకెండ్ లో దాదాపు ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయని సమాచారం. గత సీజన్లకు చెందిన పలువురు కంటెస్టెంట్లను మరోసారి హౌస్ లోకి పంపించనున్నారట. దీంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారో తెలుసుకోవడానికి అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈవారం మరో ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా.. ఇప్పుడు వీకెండ్ లోనూ మరో ఎలిమినేషన్ ఉంటుందని టాక్. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా హౌస్మేట్స్ నిర్ణయాన్ని బట్టి ఆదిత్య ఓంను బయటకు పంపించారు బిగ్బాస్. కానీ జనాల ఓటింగ్ ప్రకారం చూస్తే నైనిక అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు.
హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు బిగ్బాస్. అయితే ఈ షో కోసం ఆదిత్యకు భారీగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట. ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకున్నాడట.