గుహలో 188 ఏళ్ల వృద్ధుడు, ఎవరూ నమ్మని సంఘటన ప్రతిచోటా నమోదైంది.

divyaamedia@gmail.com
2 Min Read

భారతదేశం నుండి ఒక ఆసక్తికరమైన వీడియో త్వరగా సోషల్ మీడియాలో వ్యాపించింది. 188 ఏళ్ల వృద్ధుడు పొడవాటి జుట్టు మరియు గడ్డంతో కృంగిపోయి కనిపించాడు. అలసిపోయి నగ్నంగా కనిపించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మనిషి రూపురేఖలతో పాటు అతని వయసు కూడా చాలా చర్చనీయాంశమైంది. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న సాధువును కొందరు రక్షించారు. ఒంటి మీద బట్టలు లేకుండా, పొడవైన తెలుపు రంగు గడ్డంతో, ఒంటి మీద కండ లేకుండా మరీ బక్క చిక్కిపోయి ఉన్నాడు.

ఆ సాధువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 24 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఆ సాధువును గుహలో నుంచి బయటికి తీసుకువస్తున్నట్లు ఉంది. అయితే ఆ సాధువుకు 188 ఏళ్ల వయసు ఉంటుందని వారు పేర్కొనడం గమనార్హం. Concerned Citizen అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్ అవుతోంది. అయితే ఆ సాధువు వయసు గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. 188 ఏళ్ల వయసు ఉంటుందని వారు చెప్పినా.. అంత వయసు ఉంటుందంటే నెటిజన్లు నమ్మడం లేదు.

ఈ క్రమంలోనే అతడి వయసును నిర్ధారించేందుకు ఎంతో మంది రంగంలోకి దిగారు. అయితే కొన్ని వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ సాధువును మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ సన్యాసి అయిన సియారాం బాబా అని గుర్తించారు. అతడి వయసు 110 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జులై 2వ తేదీన నవ్‌భారత్ టైమ్స్ అనే నేషనల్ మీడియా పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో ఆ సియారాం బాబా గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోనే జిల్లాకు చెందిన సియారాం బాబా అని తేలింది. అయితే అతడికి సంబంధించిన పాత వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సియారాం బాబా ఒంటి కాలిపై 10 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు ఆ వార్తల ద్వారా తెలుస్తోంది.

ఇక సియారాం బాబా 109 ఏళ్ల వయసులో తన పనులు తాను చేసుకుంటూ కళ్లద్దాలు లేకుండానే రామాయణాన్ని చదివినట్లు తెలుస్తోంది. సియారాం బాబా చాలా తక్కువ మాట్లాడతారని.. అయినప్పటికీ ఆయన ఆశీస్సుల కోసం భక్తులు భారీగా పోటెత్తుతారని సమాచారం. మధ్యప్రదేశ్ ఖార్గోనే జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఉన్న భాట్యన్ ఆశ్రమంలో సియారాం బాబా నివసించేవారని తెలుస్తోంది. అయితే ఆయన వయసు గురించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. 109 లేదా110 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన వయసు 130 ఏళ్లు ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే అందులో చాలా మంది మాత్రం ఆయన వయసు 110 ఏళ్లు గానే చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *