గొప్ప మనసు చాటుకున్న సింగర్, 3 వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయి౦చిన సింగర్.

divyaamedia@gmail.com
2 Min Read

గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి మరో జన్మను అందించారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు..మరో సింగర్ కూడా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను నిలిపేందుకు పోరాడుతుంది. ఇప్పటివరకు మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ సింగర్ మంచి మనసు తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఇంతకీ ఆమె ఎవరంటే సింగర్ పాలక్ ముచ్చల్.

సినిమాల్లో తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయడమే కాదు.. చిన్నారుల పాలిట దైవంలా మారింది. చిన్నారుల గుండె ఆగిపోకుండా తన సొంతంగా చికిత్స చేయిస్తుంది. అయితే చిన్నారుల పాలిట దైవంలా మారింది ఓ సింగర్. చిన్నారుల గుండె ఆగిపోకుండా సొంతంగా చికిత్స చేయిస్తున్నారు సింగర్ పాలక్ ముచ్చల్. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది నిరుపేద చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. తన పాటలు ప్రాచూర్యం పొందడంతో ఆదాయం పెరిగిందని, ఒక్క కాన్సార్ట్ తో 13-14 ఆపరేషన్లకు సరిపడా నిధులను సేకరిస్తానని ఆమె వెల్లడించారు.

ఇంకా 400 కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లో ఉన్నారని తెలిపింది. తన సంపాదన వారికోసమేనని పాలక్ ముచ్చల్ చెబుతున్నారు. చిన్నారుల ప్రాణాలు నిలపడంలోనే తనకు అసలైన ఆనందమున్నదని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన గాయకురాలు పాలక్ ముచ్చల్. ఈమె చిన్న తనం నుంచే సేవాకార్యాక్రమాలను అవర్చుకుంది. గుండె జబ్బుల బారినపడిన చిన్నారులకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించేందుకు నిధులు సేకరించడానికి భారత్ తో పాటు విదేశాల్లో కూడా స్టేజ్ షోలను ఇస్తుంటారు.

పలు బాలీవుడ్ చిత్రాల్లో నేపథ్య గాయకురాలిగా ప్రదర్శన ఇచ్చారు. ఏక్ థా టైగర్, ఆషికి 2, కిక్, యాక్షన్ జాక్సన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, కాబిల్ వంటి హిందీ చిత్రాలలో ఆమె తన గాత్రాన్ని అందించింది. ఆమె పాడిన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సింగర్ పాలక్ ముచ్చల్ పై సినీ ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *