నిజం చెప్పాలంటే ఆ బంధంలో గొడవలు లేకపోతేనే ఇబ్బంది పడాలి. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. మరీ విడిపోయేంత గొడవల గురించి మనం మాట్లాడుకోవడం లేదు కానీ, ఇంట్లో రోజు జరిగే చిన్న చిన్న గొడవల గురించి మాత్రమే చర్చించుకుంటున్నాం. అయితే ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు. హాలీడేస్ వస్తే వాళ్లను తీసుకుని ఫారెన్‌కు చెక్కేస్తుంటారు.
అయితే ఇటీవల ఓ సందర్భంలో తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడారు. తాము కూడా అందరి భార్య, భర్తల్లాగే ఉంటామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. భార్య , భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. మా మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయని ఎన్టీఆర్ తెలిపారు. కానీ ఓ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తరుచూ గొడవులు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఏసీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందని, ఏసీ ఎంతలో ఉండాలనే విషయంపై గొడవపడేవారమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే.. ఎన్టీఆర్ కోసం ఆ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కాంప్రమైజ్ అయ్యేదని ఎన్టీఆర్ తెలిపారు. తాను మాత్రం ఆమె కోసం ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి ఇద్దరు సామాన్య భార్య , భర్తల మాదిరిగానే ఉంటారని ఈ మాటలతో అందరికి అర్థం అయింది.
ఎన్టీఆర్ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ తెగ మాట్లాడేస్తుంటారు. ఎన్టీఆర్‌కు పూర్తి భిన్నంగా లక్ష్మీ ప్రణతి వ్యవహరిస్తుంటారు. ఆమె బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు.ఆమె చాలా సైలెంట్‌గా కనిపిస్తారు.