హార్ధిక్‌ పాండ్యా విడాకుల తర్వాత నటాషాకు ఎంత భరణం ఇచ్చాడంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

హార్దిక్ పాండ్యా..తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ నిజమేనంటూ తేల్చేశారు హార్దిక్ పాండ్యా. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలలో అధికారికంగా వెల్లడించారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. అయితే.. అది ఎంత మొత్తంలో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై ఇటు పాండ్యా కానీ, అటు నటాషా కానీ స్పందించలేదు. అయితే.. వీరిద్దరు విడిపోతున్నారనే అనే వార్తలు వచ్చిన సమయంలో మాత్రం భరణం విషయమై ఒక వార్త బాగా వైరల్‌ అయింది. క్రికెటర్‌గా, పలు ప్రొడెక్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారీగా సంపాదించిన పాండ్యా నుంచి నటాషా భరణం కింద ఏకంగా 70 శాతం ఆస్తిని పొందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

హార్ధిక్‌ పాండ్యా తన మొత్తం ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా పేరిట మార్చేసినట్లు, ఇక విడాకులపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్య​ం అంటూ కొన్ని వారాల క్రితం నేషనల్‌ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. మొత్తం ఆస్తిలో 70 శాతం అంటే చాలా ఎక్కువని, పాపం పాండ్యా రోడ్డునపడ్డట్లే అంటూ చాలా మంది అతనిపై జాలి చూపించారు. ఆ వెంటనే లేదు లేదు.. పాండ్యా తాను సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ల అమ్మ పేరిటే ఉంచాడని..

పాండ్య పేరు మీద చాలా తక్కువ ఆస్తి ఉందనే, ఆస్తి విషయంలో పాండ్యా చాలా తెలివిగా ఆలోచించి.. అన్ని వాళ్ల అమ్మ పేరిటే కొనడం వల్ల నటాషాకు చాలా తక్కువ మొత్తంలోనే వెళ్తుందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎంత వరకు వాస్తవమో తెలియరాలేదు. అయితే.. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోతే ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది న్యాయనిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *