మొసలి నోట్లో తలపెట్టి సాహసం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్‌గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్ళు ఝల్లుమనక మానదు.

ఎందుకంటే ఈ వీడియోలో ఒక యువకుడు నీటి బయట నోరు తెరిచి విశ్రాంతి తీసుకుంటున్న మొసలి నోట్లో ఒక యువకుడు చేతి పెట్టాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణాలతో తానే చెలగాటం ఆడుతున్న వీడియో ఇండోనేషియాలోని పట్టాయాకి చెందినదిగా తెలుస్తోంది. ఇందులో ఓ యువకుడు మొసలితో కొన్ని విన్యాసాలు చేస్తున్నాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొసలి నీటి ఒడ్డుకు వచ్చిన విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఒక యువకుడు వేగంగా వచ్చి ఆ మొసలిని టచ్ చేసి చూశాడు. అప్పుడు ఆ మొసలి ఏ మాత్రం స్పందించలేదు.

దీంతో అప్పుడు ఆ యువకుడు ఓ అడుగు ముందుకు వేసి దాని నోట్లో చెయ్యి పెట్టాడు. ఒక్కసారిగా మొసలి స్పందించి అతడిని చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువకుడు వేగంగా స్పందించి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు ఆ మొసలి నీటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ యువకుడు తన చేతికి అయిన గాయాన్ని చూసుకుంటూ నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే వీడియోలో నీటిలో ఉన్న మొసలిని బయటకు తీసుకుని రాగా ఓ పెద్ద మొసలి నోరు పెద్దగా తెరిచి పడుకొని ఉంది.

అప్పుడు ఆ యువకుడు మొసలి నోట్లో తల పెట్టుకుని పడుకున్నాడు. చేయి ఊపుతూ ఏదో చెబుతున్న యువకుడి వీడియో వైరల్ అవుతోంది. యితే ఎక్కడా మొసలిని టచ్‌ చేయలేదు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ది మిలియన్ ఇయర్స్ స్టోన్ పార్క్ అండ్ పట్టాయా క్రోకోడైల్ ఫామ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *