ఎలాంటి కష్టం లేకుండా కేవలం పాత 5 రూపాయల నోటుతో 30 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా? కానీ ఇది నిజమే! కొన్ని అరుదైన పాత కరెన్సీ నోట్లకు అధిక డిమాండ్ ఉంది. అయితే కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉన్న (న్యూమిస్మాటిస్ట్స్) విదేశీయులు ఇలాంటి రూ.5 పాత నోట్లను కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. అరుదైన నోట్ల కోసం భారీ మొత్తంలో ధరలు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా రూ.5 నోటుపై కొన్ని అరుదైన ముద్రలు ఉంటే ధర లక్షల్లో పలుకుతుంది.
ముఖ్యంగా ఈ అరుదైన నోట్లపై కొన్ని నెంబర్లు ఉంటే కొనుగోలు చేసేవారు భారీ మొత్తంలో చెల్లిస్తారు. ముఖ్యంగా సాధారణ సీరియల్ నంబర్లకు బదులుగా, 786 వంటి ప్రత్యేక నంబర్ లేదా 123456 వంటి వరుస అంకెలు కలిగిన నోట్లను లక్షల్లో పెట్టి తీసుకుంటారు. ఇలాంటి నెంబర్లు కలిగిన నోట్లకి ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉంది. అలాగే ఈ నోట్లు కూడా A సిరీస్కు సంబంధించి ప్రింట్ అయి ఉంటే, డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.

భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఇలాంటి సిరీస్ నెంబర్లు కలిగిన రూ.5 నోట్లను కొన్ని మాత్రమే ముద్రించింది. ప్రస్తుతం వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇతర దేశస్తులు ఇలాంటి నోట్లను లక్షల పెట్టి కొంటున్నారు. రూ.5 నోటు ఎక్కువగా అధిక రేటు పొందడానికి నోటుపై కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనిపై వెనకవైపు రైతు ట్రాక్టర్ నడుపుతున్న చిత్రం ఉండాలి. అప్పుడే దీనిని అరుదైన నోటుగా పరిగణించి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.
నోటు పరిస్థితిని బట్టి కూడా విలువను నిర్ణయిస్తారు. నోటు పాతదైనప్పటికీ పాడవకుండా కొత్త నోటులా కనిపిస్తే.. ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నోటిపై ఏదైనా మచ్చలు లేదా చిరిగినట్టు ఉంటే నోటు విలువ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. నోటు కండిషన్ బాగుంటేనే అధిక ధరకు ఆ మూడు పోతుంది. పాత నోట్లను అమ్మడానికి ప్రస్తుతం ఎన్నో రకాల ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో eBay, CoinBazzar క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇందులో మీ దగ్గర ఉన్న అరుదైన పాత నోటును అప్లోడ్ చేస్తే.. నేరుగా కొనుగోలు చేసేవారు మీకు కాల్ చేస్తారు. డైరెక్ట్ గా ధర మాట్లాడుకుని నోట్ ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు. గతంలో అరుదైన రూ.5 నోట్లకు లక్షల్లో ధర పలికింది. ఒకరు ఇలా పాత నోటును అమ్మి ఏకంగా రూ.50 లక్షలకు పైగా సంపాదించినట్లు సమాచారం.. నీ దగ్గర కూడా ఇలాంటి పాత నోట్లు ఉంటే బయట పడేయకుండా జాగ్రత్తగా వాటిని ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ లో విక్రయించండి.