RBI నోట్లను ప్రింట్ చేసే సమయంలో ప్రతి నోటుకు ఒక గుర్తింపు సంఖ్య ఇస్తుంది. అదనంగా, నోటు నిజమైనదా లేదా నకిలీదా అని అర్థం చేసుకోవడానికి నోట్‌పై వివిధ చిహ్నాలు ప్రింట్ చేయబడతాయి. ఐతే ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మనకు నకిలీ నోట్లు విపరీతంగా చలామణిలో ఉంటాయి. అయితే చాలా సార్లు ప్రజలు తమ చేతుల్లో స్టార్ గుర్తు ఉన్న నోటును పొందినప్పుడు, ఆ నోటు నకిలీదా లేదా నిజమా అని వారు గందరగోళానికి గురవుతారు? మీరు ఎప్పుడైనా మీ పర్సులో ఉంచిన నోట్లను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొన్ని నోట్లలో సీరియల్ నంబర్ మధ్యలో ఒక చిన్న నక్షత్రం (*) ఉంటుంది.
చాలా మంది అలాంటి నోటు నకిలీ కావచ్చు లేదా దానికి కొంత ప్రత్యేక విలువ ఉంటుందని భావిస్తారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీని గురించి స్పష్టమైన సమాచారం ఇచ్చింది. ఆర్‌బిఐ ప్రకారం.. ఒక నోటు సీరియల్ నంబర్‌లో ఒక నక్షత్రం గుర్తు ఉన్నట్లయితే ఆ నోటు ‘భర్తీ నోట్’ అని అర్థం. అంటే ముద్రణ సమయంలో ఒక నోటులో పొరపాటు జరిగితే, దానిని తొలగించి దాని స్థానంలో కొత్త నోటు ముద్రిస్తారు. ఈ కొత్త నోటు సీరియల్ నంబర్‌లో ఒక నక్షత్రం (స్టార్ గుర్తు) ఉంటుంది. తద్వారా అది భర్తీ చేయబడిన నోటు అని గుర్తించవచ్చు. ఇది నకిలీ కాదు, ఇది పూర్తిగా చెల్లుతుంది.
అలాంటి నోట్లను చూసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. నక్షత్రాలు ఉన్న అన్ని నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవని RBI స్పష్టంగా చెప్పింది. మీరు ఇతర నోట్లను ఉపయోగించినట్లే వీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇవి నకిలీవి కావు. అలాగే వాటి విలువలో తేడా లేదు. స్టార్ నోట్లు ఎప్పటి నుండి చెలామణిలో ఉన్నాయి..స్టార్ గుర్తులు ఉన్న నోట్లను మొదట RBI 2006 లో జారీ చేసింది. 100 సీరియల్ నంబర్ నోట్ల బండిల్‌లోని ఒక నోటు లోపభూయిష్టంగా మారినప్పుడు, దాని స్థానంలో నక్షత్రం ఉన్న నోటును ప్రవేశపెడతారు.
ఈ నోట్లలో నక్షత్రం మాత్రమే భిన్నంగా ఉంటుంది. మిగతావన్నీ సాధారణ నోట్ల మాదిరిగానే ఉంటాయి. ఎన్ని నోట్లకు నక్షత్రం ఉంటుంది?.. అలాంటి నోట్లు పెద్దగా లేవు. ప్రతి 1,000 నోట్లులో దాదాపు 100 నోట్లు మాత్రమే నక్షత్రాన్ని కలిగి ఉండవచ్చు. అంటే ఈ వ్యవస్థ ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఒక నోటు దెబ్బతిన్నట్లు గుర్తించినప్పుడు మాత్రమే ఇలాంటి నోట్లను ముద్రిస్తారు.
Do you have a ₹500 note with a star symbol (*)❓
— PIB Fact Check (@PIBFactCheck) October 6, 2024
Are you worried it's fake❓
Fret no more‼️#PIBFactCheck
✔️The message deeming such notes as fake is false!
✔️Star marked(*)₹500 banknotes have been in circulation since December 2016
🔗https://t.co/hNXwYyhPna pic.twitter.com/MMcIo9PkHa