మార్చి 2026 నుండి రూ.500 నోట్లు రావా..? RBI ఏం చెప్పిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సోషల్ మీడియా పోస్టులో పేర్కన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఏటీఎమ్‌లలో రూ.500 నోట్లను నిలిపివేయడం లేదని పేర్కొంది. ఆర్‌బీఐ అలాంట్ ప్రకటన చేయలేదని తెలిపింది. రూ.500నోట్లు ఏటీఎమ్‌లలో సాధారణంగాఅందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద కరెన్సీగా ప్రభుత్వం 100 రూపాయల నోటును నిలుపుకుంటుందని కూడా చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ పుకార్లు వెలువడినప్పటి నుండి సామాన్యులు 10 సంవత్సరాల క్రితం జరిగిన నోట్ల రద్దు, ఆ సమయంలో వారు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

పిఐబి ఫ్యాక్ట్ చెక్‌లో క్లారిటీ: కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను నిషేధించాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో వ్యాపించే వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తోసిపుచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ సమాచారాన్ని నకిలీదని తేల్చి చెప్పింది. ఎవ్వరు కూడా ఇటువంటి పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. Xలో పోస్ట్ చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్, భారత ప్రభుత్వం 500 రూపాయల నోట్లను నిషేధించాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో వాదనలు వస్తున్నాయని పేర్కొంది. ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

నోట్లు రద్దు చేసే అంశంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని PIB మరింత స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ యూనిట్ తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లపై మాత్రమే ఆధారపడాలని PIB ప్రజలను కోరింది. Xలో తన పోస్ట్‌లో ఆర్థిక విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *