బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్‌లో కలిసి నటించారు. అయితే అసలు విషయంలోకి వెళితే బుల్లితెర నటుడుగా పేరుపొందిన వేణుగోపాల్ తన 49 ఏళ్ళ వయసులో నటి దివ్య శ్రీధర్ ను వివాహం చేసుకున్నారట.
మంగళవారం రోజున వీరి వివాహం కేరళలోని గురువాయర్ లో జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి పాతరమట్టు అనే సీరియలో నటించారట. అయితే ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ మాత్రం తనకు మొదట ప్రపోజ్ చేసింది వేణుగోపాల్ అనీ.. తనని ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపింది దివ్య.

అయితే తనని ఎలాగైనా వివాహం చేసుకోవాలని వేణుగోపాల్ పట్టుబడడంతో చివరికి తనను ఒప్పించి.. తన కుమారుడు కొడుకుని కూడా ఒప్పించి మరి వివాహం చేసుకున్నారని తమకు కూడా తండ్రి దొరికాడని తమ కూతురు, కొడుకు సంతోషంగా ఉన్నారని తెలిపింది నటి దివ్య. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అటు నటీ దివ్య, వేణుగోపాల్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
లేటు వయసులో కూడా ప్రేమకి వయసుతో సంబంధం లేదని మరొకసారి నిరూపించారు ఈ జంట అంటే పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వేణుగోపాల్ సీరియల్స్ తో పాటుగా పలు చిత్రాలలో కూడా నటించారట. దివ్య ఎక్కువగా మలయాళ సీరియల్స్ లో నెగటివ్ పాత్రలలో నటిస్తూ ఉన్నది.