ఇటీవల కాలంలో మార్కెట్ లో ఏది ముట్టుకున్న కూడా మండిపోతుంది. నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏది తక్కువ ధరకు వస్తుందని మార్కెటలో తెగ వెతుకుతున్నారు. మరోవైపు కేవలం ఆఫర్ లో కోసమే చాలా మంది సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో.. కొంత మంది మాత్రం మరీ దిగాజారీ ప్రవర్తిస్తుంటారు. సంతలో చివరకు పడేసిన కూరగాయల్ని సైతం అస్సలు వదిలిపెట్టరు.
అయితే ఏదైనా నాన్‌వెజ్‌పై ఆఫర్ అంటే చాలు.. జనాలు అక్కడికి వాలిపోతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ అని తెలిస్తే ఆగుతారా..? గతంలో బిర్యానీ ఆఫర్లకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివెళ్లి.. వాళ్లు ఇబ్బందిపడిన ఘటనలే కాదు.. పరిసర ప్రాంతాల వాసులను.. రోడ్లపై వెళ్లేవాళ్లు కూడా ఇబ్బందిపడేలా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఉషా గ్రాండ్ వద్ద ఓ రెస్టారంట్’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీంతో.. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను అదుపుచేశారు.. రూ. 2కే బిర్యానీ అని చెప్పి కేవలం 200 మందికే ఇవ్వటంతో మిగిలిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా.. రూ.2కే చికెన్ బిర్యానీ 200 మందిని సంతృప్తి పరిచినా.. మిగతా వారిని మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది.. అంతేకాదు.. వేలాది మందిని ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పెట్టింది.
రెండు రూపాయల బిర్యానీ కోసం జనం బారులు.
— The News Z (@TheNewsZtrend) August 8, 2024
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అన్ లిమిటెడ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ బిర్యానీ ఆఫర్.. బిర్యానీ కోసం బారులు తీరిన స్థానికులు. #2rupeesbiryani #godhavari #BiryaniOffer #WestGodavari #NewsUpdates #thenewsz pic.twitter.com/9xwYwG6xa5