ఆమెకు 19 మంది సంతానం, అయితేనేమి రికార్డ్ బద్దలు కొట్టింది, ఆమె ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సౌదీ అరేబియా కు చెందిన హందా అల్ రువైలీ అనే మహిళకు చదువంటే ప్రాణం. బాల్యం నుండే చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉపాధ్యాయులు కూడ ఆమెను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని వెనుకాడకుండా, ఆమెకు ఉన్నత చదువులు చదివించారు. అయితే హమ్దా 19 మంది పిల్లల తల్లి, ఆమెకు 10 మంది కుమారులు,9 మంది కుమార్తెలు ఉన్నారు. ఆమె తన పిల్లలను పెంచుతూనే చదివింది. డాక్టరేట్‌ పట్టా పొందింది. పిల్లలను పెంచడం, చదువుతో పాటు ఆమె ఇ-కామర్స్‌ను కూడా పూర్తి చేసింది.

ఇంటి పనులతో పాటు పిల్లల బాధ్యత, మరోవైపు చదువు.. ఈ పనులన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కలను సాకారం చేసుకున్నందుకు హమ్దాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హమ్దా అల్ రువైలీ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాధను వివరించారు.. హమ్దా తన చదువులు, కెరీర్, పిల్లల పెంపకం మధ్య ఇటీవల తన కోసం ఎలా సమయాన్ని కేటాయించింది.? దీనిపై, హమ్దా అల్ రువైలీ, 40 సంవత్సరాల వయస్సులో ఆమె తన సమయాన్ని విభజించుకుని పనిచేసినట్టుగా చెప్పింది.

ఇందుకోసం ఆమె పగటిపూట పని చేస్తుంది. పిల్లలను చూసుకుంటుంది. అదే సమయంలో ఆమె రాత్రిపూట తన ఇ-కామర్స్ వ్యాపారం కోసం చదువుకుంటూనే పని చేస్తుంది. టెన్షన్‌, ఆందోళన తనకు ఇష్టం లేదని చెప్పింది హమ్దా అల్. దానికోసం తను తన రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటానని చెప్పింది. ఎక్కువ మంది పిల్లలకు తల్లిని, పెద్ద బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చదువుకోవాలనే కలను వదులుకోలేదని చెప్పింది. పిల్లలు కూడా చదువులో ముందున్నారని చెప్పారు. తన చదువుతో పాటు పిల్లల చదువుల విషయంలోనూ హమ్దా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు.

తన పిల్లల గురించి హమ్దా మాట్లాడుతూ, పిల్లలు చదువులో ముందుంటారని, వారిలో అందరూ 94 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కొందరికి 100 శాతం మార్కులు కూడా వచ్చాయని చెప్పారు.. తన కూతురు హైస్కూల్లో చదువుతున్నట్టుగా చెప్పారు. తన కూతురు కూడా రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ ది గిఫ్టెడ్ నుండి అవార్డును అందుకున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *