13 అంతస్తుల భవంతిలోని మూడో ఫ్లోర్ నుంచి రెండేళ్ల పసి బాలుడు జారి కింద పడిపోయాడు. కానీ, ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. భూమికి చేరేలోపే ఓ యువకుడు మెరుపులా కదిలి ఆ బిడ్డ ప్రాణాల్ని కాపాడాడు. అయితే ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని డోంబివలీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమయస్పూర్తితో వ్యవహరించి చిన్నారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని డోంబివలీలో స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తులోని బాల్కానీ వద్ద రెండేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కిందపడిపోయింది. భవనం కింద రోడ్డుపై పలువురు వ్యక్తులు ఉన్నప్పటికీ భవేశ్ అనే వ్యక్తి పాప కింద పడిపోవడాన్ని గమనించాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో పరుగులంకించి పడిపోతున్న పాపను పట్టుకోబోయాడు. కానీ అతని చెతుల్లో నుంచి జారడంతో.. పాప నేరుగా నేలకు ఢీ కొనకుండా ప్రమాద తీవ్రత తగ్గించగలిగాడు.
దీంతో స్వల్పగాయాలతో బయటపడిన పాపను వెంటనే భజంపై వేసుకుని పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లాడు. బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడేముందు కాసేపు బాల్కనీ అంచును పట్టుకుని వేలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన గత వారం దేవిచాపాడు మండలంలో జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Real life hero saves toddler falling from 13th floor
— Tamreen Sultana (@ta38590) January 26, 2025
A two-year-old child survived a fall from the 13th-floor flat of a high-rise in Thane thanks to the alertness of a man, with a video of the act going viral on social media and drawing widespread praise from netizens pic.twitter.com/iVwLpjLkv7