రూ.10 కాయిన్లు ఉన్న వారికి అద్దిరిపోయే భారీ శుభవార్త, మీరు చెయ్యాల్సిన పని ఏంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

దుకాణదారులు రూ.10 కాయిన్‌ను తీసుకోవడం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. భాగ్యనగరంలోని చాలా మాల్స్‌లో రూ.10 కాయిన్ తీసుకోవడం లేదు. ఇటీవల నిలోఫర్ కేఫ్ వద్ద కూడా రూ.10 కాయిన్ ఇస్తే వారు నిరాకరించారు.. ఏదైనా మాట్లాడితే ”మా వద్ద నుంచి ఎవరూ తీసుకోవడం లేదు.. తామెందుకు దీనిని తీసుకోవాలని” వాదిస్తున్నారు. అయితే గతంలో అయితే రూ.10 నాణేలను కూడా తీసుకునేవారు. షాపుకు వెళ్లి రూ.10 కాయిన్ ఇస్తే.. వ్యాపారులు స్వీకరించే వారు. అయితే తర్వాత క్రమక్రమంగా ఈ రూ.10 నాణేలను తీసుకోవడం ఆపేశారు. షాపుకు వెళ్లి రూ.10 కాయిన్ ఇస్త.. ఇప్పుడు తీసుకునే పరిస్థితులు లేవు.

దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర కష్టాలు కూడా వచ్చిపడుతున్నాయి. రూ.10 కాయిన్లు కొంత మంది దగ్గర చాలానే ఉండిపోయాయి. ఎవ్వరూ వీటిని తీసుకోకపోవడం వల్ల అవి ఉన్నా కూడా లేనట్లే అని చాలా మంది ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అయితే రూ.10 కాయిన్లు కలిగిన వారికి మాత్రం ఇది ఊరట కలిగే అంశం. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రూ.10 కాయిన్లపై ఫోకస్ చేసింది. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకులు క్షేత్రస్థాయిలో వ్యాపారుల్లో, సామాన్యుల్లోల రూ.10 కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నాయి. కడపలో కూడా ప్రముఖ బ్యాంక్ ఈ రూ.10 నాణేలపై ప్రజల్లో అవగాహన కల్పించింది.

ఆర్‌బీఐ ప్రకారం చూస్తే.. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి. అంటే ప్రజలు ఈ రూ.10 నాణేల ద్వారా క్రయవిక్రయాలు జరపొచ్చు. రూ.10 నాణేల చెల్లుబాటుపై ఎటువంటి అపోహలు వద్దని, వాటిని నిరభ్యతరంగా తీసుకోవచ్చని కడప ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కూడా స్పష్టం చేసింది. బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌ మేనేజరు గోపిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై ఏపీజీబీ అధికారులు, ఉద్యోగులు ప్రచార కార్యక్రమంతో పాటు మేళా కూడా ఇటీవలనే నిర్వహించారు. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని స్పష్టత ఇచ్చారు. అలాగే ఈ రూ.10 నాణేలు ఎవరైనా తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అందువల్ల షాపు యజమానులు, వ్యాపారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రూ.10 కాయిన్లు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. రూ.10 కాయిన్లపై ప్రజల్లో ఒక అపోహ వేగంగా విస్తరించింది. రూ.10 నాణేలు చెల్లుబాటు కావని అందరూ భావిస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదు. బ్యాంకులు మాత్రం రూ.10 కాయిన్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నాయి. అందువల్ల మీరు మీ వద్ద రూ.10 నాణేలు కలిగి ఉంటే మాత్రం వాటిని ఏమైనా కొనుగోలుకు ఉపయోగించొచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *