AP CM YS JAGAN || మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఎక్కడికీ కదలొద్దు || DARSI LIVE NEWS

AP CM YS JAGAN || మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఎక్కడికీ కదలొద్దు || DARSI LIVE NEWS

మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఎక్కడికీ కదలొద్దు!

తాడేపల్లి: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్టు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. ‘‘ప్రతి జిల్లాలో 200 బెడ్‌లను ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో సరాసరి 100 పడకలను క్వారంటైన్‌ కోసం సిద్ధం చేశాం. ఇవన్నీ అందుబాటులోకి తెచ్చాం. ప్రయివేటు సెక్టార్‌లో కరోనా కోసమే 213 వెంటిలేటర్లను సిద్ధం చేశాం. ఈ వ్యాధి ప్రబలితే అవసరమైన చర్యలతో ముందస్తుగా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని చర్యలు తీసుకున్నా మనం చేయాల్సిన పనులు మనం చేయకపోతే లాభం ఉండదు. మళ్లీ మళ్లీ చెబుతున్నా ఎవరూ ఎక్కడికీ కదలొద్దు.. ఎక్కడ వాళ్లు అక్కడే ఉండండి.  రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1902కు ఫోన్‌ చేయండి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు నేతృత్వంలో 10 మంది సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో కలిపి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్‌ చేయండి. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వస్తే 104కు ఫోన్‌ చేయండి’’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.