ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు : ఏపీ డీజీపీ సవాంగ్

ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు : ఏపీ డీజీపీ సవాంగ్

ఇ-పాస్‌ విధానం

★ ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే *వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్‌ హెచ్చరించారు.
★ అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు.

★ *‘‘అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఇ-పాస్‌ విధానం అమలు* చేయనున్నాం. ఇ-పాస్‌ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.

★ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ *రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.* రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదు.

★ *శుభకార్యాలకు అధికారుల వద్ద *తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.* కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి.

★ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. *ఉల్లంఘనలపై డయల్‌ 100, 112నెంబర్లకు సమాచారం* అందించాలి’’ అని డీజీపీ అన్నారు.

★ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విజృంభణలో సర్కారు పగటి *కర్ఫ్యూ అమలు చేస్తున్న* విషయం తెలిసిందే. ★ *ఈ నెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి