పెళ్లి లో రచ్చ చేసిన వరుడు - తప్పతాగి వధువుకు బదులు ఆమె తల్లి మెడలో..!

పెళ్లి లో రచ్చ చేసిన వరుడు - తప్పతాగి వధువుకు బదులు ఆమె తల్లి మెడలో..!

పెళ్లి లో రచ్చ చేసిన వరుడు 

తప్పతాగి వధువుకు బదులు ఆమె తల్లి మెడలో..!


ఒక పెళ్లిలో వరుడు చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తప్ప తాగి పెళ్లి మంటపానికి వచ్చిన వరుడు.. వధువుకు బదులు ఆమె తల్లి మెడలో దండ వేయబోయాడు. పక్కనున్న స్నేహితులు వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించారు.
 

అనంతరం వధువు మెడలో వరుడి చేత దండ వేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఊగుతున్న పెళ్లి కొడుకు దండ వేయకుండానే కింద పడిపోయాడు. ఈ వీడియోను నిరంజన్‌ మహాపాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కొడుకు తీరుపై మీమ్స్, సెటైర్లు పడుతున్నాయి. అయితే ఈ వివాహం ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు.