అమానుషం

రోజుకు రెండు వేలు దాటుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు... పదుల సంఖ్యలో కొవిడ్‌ మరణాలు... తిరుపతిలో విరామం లేకుండా రగులుతున్న చితి మంటలు... మృతదేహాలను కూడా మార్చురీలోనే వదిలేసి వెళుతున్న కుటుంబీకులు... అనాధ శవాలుగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు.. అయినవారిని కోల్పోతున్న కుటుంబాలు... తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధలుగా మారుతున్న చిన్నారులు... వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోతున్న జీవితాలు... లాక్‌డౌన్‌తో బతుకుదెరువు కరువై నలిగిపోతున్న పేదల బతుకులు... కరోనా నేపధ్యంలో జిల్లాలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులివి. అయితే ఇలాంటి విపరీత పరిస్థితుల్లోనూ కొందరిలో పశువాంఛలు, పరువు పేరిట ఉన్మాదాలూ పడగ విప్పుతుండడమే కరోనాకు మించి భయపెడుతోంది.