మాట వినని ప్రజలు.. ఇక లాక్ డౌన్ కు రెడీగా ఉండాలంటున్న ప్రభుత్వం - Darsi Live News

మాట వినని ప్రజలు.. ఇక లాక్ డౌన్ కు రెడీగా ఉండాలంటున్న ప్రభుత్వం - Darsi Live News

మాట వినని ప్రజలు.. ఇక లాక్ డౌన్ కు రెడీగా ఉండాలంటున్న ప్రభుత్వం - Darsi Live News

కరోనా కేసులు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అంతకంతకూ పెరుగుతున్నాయి కూడానూ..! ఇప్పటికే పలు నగరాల్లో లాక్ డౌన్ అమలులో ఉండగా..

రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండో విడత లాక్‌డౌన్‌ విధించే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంపై ప్రభావం పడకుండా లాక్‌డౌన్‌ను ఎలా విధించాలో కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపె, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆదివారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌-19 రోగుల కోసం ఆసుపత్రుల్లో సిద్ధం చేసిన పడకలు, ఆక్సిజన్‌, వైద్య సామగ్రి.. తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టాలంటే కఠినమైన లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌ సిఫార్సు చేసింది. గత వారం రోజుల్లోనే లక్ష మందికి కరోనా నిర్ధారణ కావటం కలకలం రేపుతోంది. ఒక్క శనివారం రోజే మహారాష్ట్రలో 166 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 2021లో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు మహారాష్ట్రలో నమోదు కావడం ఇదే తొలిసారి.

కరోనా కట్టడి కోసం మార్చి 28 నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. అయిదుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటాన్ని నిషేధించింది. పండగలు, శుభకార్యాలతో పాటు రాజకీయ, మతపరమైన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో 3.75 ల‌క్ష‌ల ఐసోలేష‌న్ పడకలు, 1.07 ల‌క్ష‌ల సాధారణ పడకలు నిండిపోయాయని తెలిపారు. 60,349 ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా పడకలు ఉన్నాయ‌ని, వాటిలో 12,701 బెడ్ల‌పై ఇప్పటికే రోగులు చికిత్స పొందుతున్నారు.

కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కొరత ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి