కొడుకు పెళ్లి.. అత్త గర్భవతి, తలపట్టుకున్న కోడలు - Darsi Live News

కొడుకు పెళ్లి.. అత్త గర్భవతి, తలపట్టుకున్న కోడలు  - Darsi Live News

కొడుకు పెళ్లి.. అత్త గర్భవతి, తలపట్టుకున్న కోడలు

కొడుకు పెళ్లిలో.. ఓ మహిళ ఊహించని ప్రకటన చేసింది. ఆమె చెప్పిన ‘గుడ్‌న్యూస్’ విని కొడుకు కోడలితోపాటు అతిథులంతా నోరెళ్లబెట్టారు. అదేంటీ గుడ్‌న్యూస్ చెబితే అంతా సంతోషించాలి గానీ.. ఆశ్చర్యపోవడం ఏమిటనేగా మీ సందేహం? అయితే, ఆమె ఏం చెప్పిందో తెలిస్తే మీరు కూడా తప్పకుండా షాకవుతారు. ఓ యువతి తన పెళ్లిలో ఎదురైన చేదు అనుభవం గురించి ‘రెడిట్’లో వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ జంట నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ సందర్భంగా తక్కువ మంది అతిథుల మధ్యే పెళ్లి చేసుకున్నారు. విందు సమయంలో వధువు తండ్రి, వరుడి తమ్ముడు మైకులో వారి గురించి మాట్లాడారు. అయితే, వరుడి తల్లి కూడా మైకులో ఓ ముఖ్య విషయం చెప్పాలని కోరింది. దీంతో ఆమె తన కొడుకు గురించి గొప్పగా ఏదైనా చెప్పాలని భావిస్తున్నారు కాబోలని భావించి మైకు ఇచ్చారు. అయితే, ఆమె ఊహించని విషయం చెప్పింది. మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతానంటూ.. తాను గర్భవతినని వెల్లడించింది. దీంతో వధువరులు, ఆమె బంధువులు, అతిథులు షాకయ్యారు. ఇదేంటీ.. ఈ వయస్సులో ఆమె గర్భం దాల్చడం ఏమిటీ? అది కూడా కొడుకు పెళ్లిలో అందరి ముందు ప్రకటించడం ఏమిటని ఆశ్చర్యపోయారు.

‘‘ఆమె అలా ప్రకటిస్తాదని అస్సలు ఊహించలేదు. ఆమెకు మైకు ఇవ్వకుండా ఉండాల్సింది. వాస్తవానికి.. నా పెళ్లి రోజున నేను కూడా నా ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించాలని అనుకున్నా. కానీ, మా పెళ్లిలో ఆమె తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించింది. దీంతో మేం ఇక వెడ్డింగ్ స్పీచ్ ఇవ్వలేకపోయాం. అతిథులంతా మా పెళ్లి గురించి మాట్లాడుకోవడం మానేశారు. అంతా ఆమె గర్భం గురించే మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి నేను నా అత్తతో మాట్లాడటం లేదు’’ అని తెలిపింది. నెటిజనులు వధువుకే మద్దతు తెలుపుతున్నారు. పెళ్లిలో ఆమె తన ప్రెగ్నెన్సీ కోసం వెల్లడించడం మంచి నిర్ణయం కాదని అంటున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి