అది సేవించడమే కొంపముంచిందా... ఒకే గ్రామంలో ముగ్గురు మృతి - Darsi Live News

అది సేవించడమే కొంపముంచిందా... ఒకే గ్రామంలో ముగ్గురు మృతి - Darsi Live News

అది సేవించడమే కొంపముంచిందా... ఒకే గ్రామంలో ముగ్గురు మృతి - Darsi Live News

కల్తీ కల్లు తాగిన మృతుల కుటుంబ సభ్యులు స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన గ్రామానికి చెందిన సిద్దయ్య (47), వెంకట్ రాముడు (54), వెంకన్న (60) కల్లు తాగడానికి కల్లు కాంపౌండ్ వద్దకు వెళ్లారు. కాంపౌండ్ వద్ద కల్లు తాగి అదే రోజు రాత్రి మృతి చెందారు. వెంకట్ రాముడు రాత్రి 9 గంటలకు సమయంలో కల్లు తాగి ఇంటికి వచ్చి.. రొట్టె తింటూ నురగలు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందారని ఆమె భార్య సరోజమ్మ తెలిపారు.

వెంకన్న ప్రతిరోజు కల్లు తాగుతారని ఆరోజు తాగొచ్చి రాత్రి చనిపోయారని ఆయన భార్య నాగేశ్ అమ్మ తెలిపారు. సిద్దయ్య మాత్రం కల్లు తాగి చనిపోలేదని అతడి భార్య తెలిపింది. ఈ సంఘటన ఈనెల ఎనిమిదో తేదీ ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టికి వెళ్ళింది. వారు మాత్రం ఇలాంటి విచారణ జరపకుండా గోప్యంగా ఉండడం పలు అనుమానాలకు తావి తీస్తుంది ఒకే రోజు కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం గ్రామాల్లో కలకలం సృష్టించింది. కల్తీకల్లు కారణంగానే వారు మృతి చెందారని స్థానికంగా ప్రచారం జరుగుతుండగా.. మరికొందరు అస్వస్థత గురయ్యారని తర్వాత కోలుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఇలాంటి ఎన్నో పెద్ద సంఘటనలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీకల్లు రాజ్యమేలుతుంది. జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లా , నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాలో కల్తీకల్లు తయారీలో ప్రత్యేక మాఫియా తయారయింది. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లు లో కలిపే నిషేధిత క్లోరో హైడ్రేట్ సిహెచ్ ఆల్ఫా జలం పదార్థాలు విచ్చలవిడిగా కల్లు కాంపౌండ్ లలో తయారవుతున్నాయని పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలామంది పనులు లేక ఇంట్లో ఉంటున్నారు. లిక్కర్ లకు అలవాటైన వారి చేతులలో డబ్బులు లేకపోవడంతో కల్లు కంపౌండ్ పైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తాటి, ఈత చెట్లు లేకున్నా డ్రమ్ముల కొద్ది కల్లు కాంపౌండ్ లో దర్శనమిస్తున్నాయి. అందులో సీహెచ్ కలుపుతూ ఉండడంతో దాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది లాక్ డౌన్ లొనే జడ్చర్ల మండలంలోని ఆలూరు లో కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి చెందగా..

ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండకుండా ప్రజలను కాపాడాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. చర్యలు తీసుకుంటాం.. కల్లు కాంపౌండ్ లో కల్తీకల్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నామని మానవపాడు మండలం జిల్లా పురం లో జరిగిన సంఘటనపై కూడా విచారణ జరుపుతామని మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి అన్నారు. సిహెచ్ సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.