ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు

ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. కంటిలో వేసే చుక్కుల మందుకు తప్ప మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది.  

ఆనందయ్య మందులు హానికరం కాదని నివేదికలు వచ్చాయి. సిసిఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది.  ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఎల్, ఎఫ్ అనేవాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని గ్యారంటీ ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం సోమవారంనాటి సమీక్షా సమావేశంలో ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకుంది.

కంట్లో మందు వేసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య సోమవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కంట్లో మందు వేసిన మరుక్షణమే తనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి ఈ రోజు మరణించారు. కాగా, బొనిగె ఆనందయ్య మందుపై కూడా జగన్ సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారాం చేస్తోందని ఏపీ హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కరోనాపై సమీక్షలో ఆనందయ్య మందుపై కూడా సమీక్ష జరుగుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. 
 

కృష్ణపట్నంలో కరోనా మందును పంపిణీ చేస్తూ వచ్చిన ఆనందయ్య ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు. తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద ప్రభుత్వం విచారణ జరుపుతోంది.  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి కర్ఫ్యూను పొడగించింది. కర్ఫ్యూ వేళల్లో మార్పులేమి చేయలేదు. జూన్ 10వ తేదీన వరకు ఏపీలో కర్ఫ్యూను పొడగించారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్పటిలాగే ఏపీలో కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, రోజులో పది వేలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. కర్ఫ్యూను కొనసాగించడం వల్ల ఆ సంఖ్యను మరింత తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.