వారంలో నాలుగు రోజులు సంపూర్ణ లాక్ - Darsi Live News

వారంలో నాలుగు రోజులు సంపూర్ణ లాక్ - Darsi Live News

బెంగళూరు: జిల్లాలవారీగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో పలు ప్రాంతాలలో ఎవరికి వారు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు హాసన్‌ జిల్లాలో వారంలో నాలుగురోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించనున్నారు.
 

ఈమేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గోపాలయ్య బుధవా రం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. చివర కు హాసన్‌ జిల్లాలో ప్రత్యేక నిబంధనలు అమలు చేయదలిచారు. ప్ర తిరోజూ జిల్లావ్యాప్తంగా 6 నుంచి 10వరకు నిత్యావసరాలకు వెసలు బాటు కల్పించారు. ఈ విధానం సోమ, బుధ, శుక్రవారాలలో అమ లు చేసి మిగిలిన నాలుగు రోజుల్లో పాలు, మెడికల్‌ షాపులు మినహా మిగిలిన అన్ని దుకాణాలను పూర్తిగా మూసివేయదలిచా రు. జిల్లాలోని అందరి ఎమ్మెల్యేల అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా సమర్థించారు.
 

దీంతో గురువారం హాసన్‌ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కానుంది. కాగా కొవిడ్‌ బాధితులకు హోం ఐసొలేషన్‌లో సమగ్ర చికిత్సలు, మందులు సమకూర్చదలిచారు. హాస్టళ్ళను కొవిడ్‌ కేర్‌ సెంట ర్‌లుగా మార్చదలిచినట్టు మంత్రి తెలిపారు. మాజీ ప్రధాని దేవేగౌడకు ఫోన్‌ చేసి అభిప్రాయాన్ని సేకరించారు. కాగా కొడగు జిల్లాలో ఇటువంటి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉంది. జిల్లాలో ఐదు రోజులపాటు లాక్‌డౌన్‌ చేయనున్నారు.