కరోనా సోకిన భర్తకు నోటితో శ్వాస - Darsi Live News

కరోనా సోకిన భర్తకు నోటితో శ్వాస - Darsi Live News

కరోనా సోకిన భర్తకు నోటితో శ్వాస - Darsi Live News

ఆగ్రా :  కరోనా సోకిన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఆ మహిళ. శ్వాస ఆడక తన కళ్ల ముందే కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భర్తకు తన నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయినా, భర్తను కాపాడుకో లేక పోయింది. మనసును కలచివేసే ఈఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది.
 

రవి సింఘాల్‌(47) కొవిడ్‌తో బాధపడుతూ హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాడు. అతడి పరిస్థితి హఠాత్తుగా విషమించడంతో భార్య రేణు సింఘాల్‌ ఆటోలో అతణ్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించింది. ఆస్పత్రి సమీపంలో అతడి పరిస్థితి విషమించింది.
 

ముక్కుతో శ్వాస ఆడక నోటితో గాలిపీల్చుకునేందుకు యత్నిస్తూ విలవిల్లాడిపోయాడు. భర్త బాధ చూసి తట్టుకోలేకపోయిన రేణు ప్రమాదమని తెలిసి కూడా భర్త నోటిని తన నోటితో మూసి బలంగా గాలి ఊదుతూ ఊపిరి పోసేందుకు యత్నించింది. తన కోసం తపిస్తున్న భార్య ఒడిలోనే తల వాల్చేశాడు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి