Black Fungus: పెద్దపేగుకు సోకిన బ్లాక్​ ఫంగస్ ​

Black Fungus: పెద్దపేగుకు సోకిన బ్లాక్​ ఫంగస్ ​

మహారాష్ట్రలో నమోదైన ఓ బ్లాక్​ ఫంగస్​ కేసు ఆందోళనను కలిగిస్తోంది. నాగ్​పుర్​కు చెందిన 70ఏళ్ల వృద్ధుడి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్​ ఫంగస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సెవెన్​ స్టార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణంగా ఇప్పటికే ఆయన కంటిచూపు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర.. బ్లాక్​ ఫంగస్ వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి