నిస్సహాయులుగా మారాం: ఓ వైద్యురాలి భావోద్వేగం - Darsi Live News

నిస్సహాయులుగా మారాం: ఓ వైద్యురాలి భావోద్వేగం - Darsi Live News

నిస్సహాయులుగా మారాం: ఓ వైద్యురాలి భావోద్వేగం - Darsi Live News

కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిస్సహాయులుగా మారామని ముంబయికి చెందిన ఓ వైద్యురాలు డా.తృప్తిగిలాడి భావోద్వేగానికి గురయ్యారు. మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఉపద్రవం నుంచి బయటపడతామని సూచించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి.
 

నగరాలు, పట్టణాలు, పల్లెలను కరోనా చట్టేసింది. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. రోగులకు పడకలు లభించడంలేదు. వైద్యులు, వారి బంధువులకు కూడా పడకలు దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. మేము నిస్సహాయులుగా మారుతున్నాం. ఇలాంటి పరిస్థితులను నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని ఆ వైద్యురాలు భావోద్వేగానికి గురయ్యారు. ‘నాకు ఇప్పటివరకు కరోనా రాలేదు.

నాకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. ఇకపై కూడా నాకు కరోనా రాదు అని మీరు అనుకుంటే అది పొరపాటే. యువకులు కూడా వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నారు. మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదనే మేము కోరుకుంటున్నాం. కచ్చితమైన జాగ్రత్తలు వహించండి. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే. ఏవైనా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు పాటించాలి.
 

అలా చేస్తే అవసరమైన వారికి పడకలు అందించిన వారమవుతాము’ అని పేర్కొన్నారు. వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, అందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను ఎదుర్కోగలమని, మూడో దశ రాకుండా నివారించగలమని పేర్కొన్నారు. ప్రసుత్తం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి