వైసీపీ సర్కారుకు షాక్.. ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన..

వైసీపీ సర్కారుకు షాక్.. ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన..
వైసీపీ సర్కారుకు షాక్.. ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన దరిమిలా... పంచాయితీ రాజ్ చట్టంలోని విశేష అధికారాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. అయితే, ఇప్పటిదాకా జరిగిన పక్రియ ఏది కూడా రద్దు కాబోదని, నామినేషన్లు, ఏకగ్రీవాలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అందుకే వాయిదా.. కొవిడ్ 19(కరోనా వైరస్) భయానక రీతిలో వ్యాప్తి చెందితున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించాయి. శనివారం నుంచి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. మరోవైపు కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. జనం గుంపులుగా కూడొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరే పరిస్థితి నెలకొంటుంది. అలాంటప్పుడు కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లవుతుంది. దీనిపై అత్యున్నత స్థాయి చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేయాలని డిసైడైనట్లు కమిషనర్ రమేశ్ కుమార్ వివరించారు.
కరోనా ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా అసాధారణ స్థితి నెలకొందని, సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో కేంద్ర సర్కారుతోపాటు రాష్ట్ర యంత్రాంగంతోనూ సుదీర్ఘ మంతనాలు జరిపామని, ప్రజారోగ్యం కోణంలో మాత్రమే ఎన్నికల వాయిదా వేస్తున్నాం తప్ప.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణానికి, పక్షపాతానికి తావులేదని ఈసీ రమేశ్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్ష టీడీపీ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనీ వివరణ ఇచ్చారు.

 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి