వారిలో ప్రమాదకరంగా మారుతున్న కరోనా

వారిలో ప్రమాదకరంగా మారుతున్న కరోనా

వారిలో ప్రమాదకరంగా మారుతున్న కరోనా 


కరోనా కాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు వైద్యులు. భారీ పొట్ట, ఒబెసిటీ ఉన్న కరోనా రోగులకు వ్యాధి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి.
ఇలాంటి వారికి కరోనా ట్రీట్‌మెంట్‌లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఒబెసిటీ ఉన్న వాళ్లు కరోనా ట్రీట్‌మెంట్‌ సమయంలో చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వీరికి హయ్యర్‌ వెంటిలేషన్‌ ప్రజర్‌ అవసరమవుతోంది. ఒబెసిటీ ఉన్న వ్యక్తులతోపాటు.. ఇటీవలకాలంలో పొట్ట పెరిగిన యువత కూడా కరోనా చికిత్స సమయంలో ఇబ్బందిపడుతున్నారట.

సాధారణ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ఉండి పొట్ట ఉన్న వ్యక్తుల కొంటే, సన్నగా ఉన్నా పొట్ట లేని వారు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారట. కరోనా మూడో వేవ్‌ పొంచి ఉందంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ఫిట్‌నెస్‌పై ప్రజలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా నుండి బయటపడాలంటే, కరోనా బారిన పడినా వేగంగా కోలుకోవాలంటే ఫిట్‌గా ఉండటం చాలా అవసరం అని చెబుతున్నారు.