భర్తకు విడాకులిచ్చి అతని కొడుకునే పెళ్లాడింది - Darsi Live News

భర్తకు విడాకులిచ్చి అతని కొడుకునే పెళ్లాడింది - Darsi Live News

కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో.. ఎలా ముగుస్తాయో తెలీదు. ఇదిగో వీరి బంధం కూడా అలాంటిదే. ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మహిళ.. అతడికి విడాకులిచ్చి కొడుకును పెళ్లాడింది. మాజీ భర్తకు కోడలిగా అదే ఇంట్లో కుడికాలు పెట్టింది. ఇది వినేందుకు చిత్రంగా, అసహ్యంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే. రష్యాలోని క్రాస్నాదర్‌ క్రాయికి చెందిన మరీనా బల్మాషేవాకు 35 ఏళ్లు.. పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే పదేళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ప్రేమగా చూసుకొనేది. అయితే కొన్ని నెలల కిందట అర్రేతో మనస్పర్థలు రావడంతో మరీనా అతడికి విడాకులిచ్చి ఒంటరిగా జీవిస్తోంది. అయితే పదేళ్లపాటు ఆమెతోపాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్‌ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్‌కు ఇప్పుడు 20 ఏళ్లు. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా.. వ్లాడిమిర్‌ మాత్రం నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు. దీంతో వారి మధ్య ఉన్నది తల్లి, కొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. ఇందుకు అతడు కూడా అంగీకరించాడు. తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తన మాజీ భార్య కోడలిగా ఇంటికి తిరిగి వస్తుందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. కానీ కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే అంగీకరించాడు. ఈ ఏడాది ఆరంభంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా వైరస్‌ వల్ల పెళ్లి వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిజిస్ట్రర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వెడ్డింగ్‌ డ్రస్‌తో ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అయితే వీరి పెళ్లిపై సోషల్‌ మీడియా భిన్నంగా స్పందిస్తోంది. ''పదేళ్ల పాటు తండ్రితో కాపురం చేసిన నువ్వు.. కొడుకుతో కూడా కాపురం చేయడానికి మనసు ఎలా అంగీకరించింది? అతడి తండ్రితో ప్రేమ లేకుండానే అన్నేళ్లు కాపురం చేశావా?'' అని ప్రశ్నిస్తున్నారు. ''వరసకు కొడుకు అవుతాడని తెలిసిన వెంటనే మహిళ అతడిపై ఎలాంటి తప్పుడు కోరికలు పెంచుకోదని, కానీ నీకు అలా ఎలా అనిపించింది?'' అని మరికొందరు నిలదీస్తున్నారు. కొందరు మాత్రం వీరి ప్రేమకు మద్దతు తెలుపుతున్నారు. మనసులో ప్రేమను ధైర్యంగా బయటపెట్టి.. లీగల్‌గా పెళ్లి చేసుకున్నారని, కొందరైతే గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సంబంధం నడుపుతారని అంటున్నారు. వారితో పోల్చితే ఈ జంట చాలా ఉత్తమం అని ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా ప్రేమ మరీ ఇంత గుడ్డిదా!!

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి