మరో అల్పపీడన ముప్పు..4వ తేదీ నుంచి - Darsi Live News

మరో అల్పపీడన ముప్పు..4వ తేదీ నుంచి - Darsi Live News

మరో అల్పపీడన ముప్పు..4వతేదీ నుండి

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.! ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగష్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో రాగాల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తాంధ్రా, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కోస్తాంధ్రాలోని పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి