ఆండ్రాయిడ్ ఫోన్ వాడకం దారులకు కీలక సూచన... Android Users in India Live News

ఆండ్రాయిడ్ ఫోన్ వాడకం దారులకు కీలక సూచన... Android Users in India Live News

ఆండ్రాయిడ్ ఫోన్ వాడకం దారులకు కీలక సూచన... Android Users in India Live News

భారత్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్న వారు సైబర్‌ నేరగాళ్ల బారిన పడే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు హెచ్చరించారు. జాగ్రత్త పడకుంటే వీరి వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతికి చిక్కేందుకు అధిక అవకాశాలున్నాయని వారు తెలిపారు. దీనిని నివారించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది. తమ ఫోన్లలో ఇంకా పాత ఓఎస్‌ వాడుతున్న వారు ప్రమాదం అంచున ఉన్నట్టు సెర్ట్‌ తెలిపింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌లో స్టాండ్‌హాగ్‌ 2.0 అనే బగ్ ఉన్నట్టు కనుగొన్నామని.. దీని బారిన పడిన ఫోన్లలోని ఏ యాప్‌నైనా హ్యాకర్లు హైజాక్‌ చేయవచ్చంటూ సెర్ట్‌ తెలిపింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం... ఆండ్రాయిడ్‌ 10 లేదా ఆపై వెర్షన్లకు అప్‌డేట్‌ కాని ఫోన్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యేందుకు అనేక అవకాశాలున్నాయి. 

ఏం చేయాలి?

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను ఉపయోగించే వారందరూ తమ ఫోన్లలో అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందుకు గాను, ఫోన్లో ఉండే ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లి దానిలోని ‘సిస్టమ్‌ అప్‌డేట్‌’ అనే ఆప్షన్‌ను తెరవాలి. దానిలో అప్‌డేట్‌పై ఏదైనా సూచన కనిపిస్తే... వెంటనే తమ ఫోన్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఇంచుమించు అన్ని ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10ని సపోర్ట్‌ చేస్తాయని... వినియోగదారులు వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలని నిపుణులు కోరారు. పేరొందిన, నమ్మదగిన అప్లికేషన్‌ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని... అదే విధంగా, ఇమెయిల్‌, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లను, వెబ్‌సైట్లను విచక్షణా రహితంగా తెరవద్దని సెర్ట్‌ మరోసారి హెచ్చరించింది.

 

 

Tags: 

mobile phone,andriod phone,IT Ministry,android OS,android 10,google,మొబైల్‌ ఫోన్‌,యాండ్రాయిడ్‌ ఫోన్‌,ఐటీ శాఖ్,యాండ్రాయిడ్‌ 10,గూగుల్‌,Telugu News, News Telugu, News in Telugu, Breaking Telugu News, Breaking News in Telugu, Telugu Breaking News, Breaking Telugu Cinema News, Breaking Sports Telugu News, Breaking Political Telugu News, Breaking Business Telugu News, Breaking Crime Telugu News, Breaking Andhra Pradesh Telugu News, Breaking Telangana Telugu News, Breaking Hyderabad Telugu News, Latest Telugu News, Latest News in Telugu, Telugu Latest News, Latest Telugu Cinema News, Latest Sports Telugu News, Latest Political Telugu News, Latest Business Telugu News, Latest Crime Telugu News, Latest Andhra Pradesh Telugu News, Latest Telangana Telugu News, Latest Hyderabad Telugu News, Top stories, telugu top stories,Business news in Telugu, Telugu business news, Business News, బిజినెస్ న్యూస్, Sensex news in Telugu, gold rates in Hyderabad, Todays Latest Business News LIVE Updates in Telugu, Business News Today in Telugu, Market News in Telugu, Share Market News in Telugu, Stock Market News in Telugu, economic news in Telugu, economic news today in Telugu, financial news in Telugu, latest business news in Telugu, latest economic news in Telugu, latest stock market news in Telugu, market news in Telugu, market news today in Telugu, market update in Telugu, బిజినెస్ News in Telugu, బిజినెస్ News, బిజినెస్ News Live, Latest, బిజినెస్ News in Telugu, Breaking బిజినెస్ News in Telugu, Online బిజినెస్ News in Telugu, వ్యాపారం వార్తలు ఆర్థిక వార్తలు ఫైనాన్స్ వార్తలు స్టాక్ & షేర్ మార్కెట్ వార్తలు, Top stories, telugu top stories,mobile phone, andriod phone, IT Ministry, android OS, android 10, google, మొబైల్‌ ఫోన్‌, యాండ్రాయిడ్‌ ఫోన్‌, ఐటీ శాఖ్, యాండ్రాయిడ్‌ 10, గూగుల్‌, business, latestnews, Warning, for, Android, users, in, India, CERT, In, issues, advisory, 0100, 120070817, ఆండ్రాయిడ్‌, ఫోన్‌, వాడకందార్లకు, కీలక, సూచన, Warning, for, Android, users, in, India, CERT, In, issues, advisory

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి