కోస్తాలో భారీ వర్షాలు - Darsi Live News

కోస్తాలో భారీ వర్షాలు - Darsi Live News

గ్రేటర్‌ విశాఖ బ్యూరో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. విశాఖలో 5, గుంటూరులో 6, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 9, ఒంగోలులో 5, విజయనగరం జిల్లాలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు. రాయలసీమలోనూ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి