నిండు దుస్తుల్లో రేసర్‌గా కనిపించిన ఆమె ... పోర్న్ స్టార్‌గా మారిపోయింది.. Viral News Telugu

నిండు దుస్తుల్లో రేసర్‌గా కనిపించిన ఆమె ... పోర్న్ స్టార్‌గా  మారిపోయింది.. Viral News Telugu

14 ఏళ్ల వయస్సులోనే కార్ రేసర్‌గా పేరుగాంచిన ఆమె.. ఇప్పుడు పోర్న్ స్టార్‌గా మారిపోయింది. ఆమె అలా ఎందుకలా చేయాల్సి వచ్చింది?

జీవితంలో పైకెదగాలని ఎంతోమంది కలలుగంటారు.

ఆశయాలనునెరవేర్చుకోవాలనిప్రయత్నిస్తారు. కానీ, విధి ఎప్పుడు.. ఎలా.. జీవితాన్ని మలుపు తిప్పుతుందో తెలీదు. చివరికి, మలుపుల్లో సైతం అవలీలగా దూసుకెళ్లిపోయే ఆ మహిళా కారు రేసర్ సైతం.. తన జీవితంలో ఎదురయ్యే మలుపుల గురించి తెలుసుకోలేకపోయింది. ఊహించని విధంగా ఆమె అడల్ట్ స్టార్‌గా మారిపోయింది. నిండు దుస్తుల్లో రేసర్‌గా కనిపించిన ఆమె.. ఇప్పుడు వలువలు వదిలి నగ్న జీవితాన్ని గడుపుతోంది. అందాలను ఆరబోసి.. కుర్రకారు గుండె వేగాన్ని పెంచేస్తోంది. ఆమే రేనీ గ్రేసీ. వయస్సు 25 ఏళ్లు ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఈ మాజీ రేసర్.. 14 ఏళ్ల నుంచే ఫుల్‌టైమ్ మహిళా రేసర్‌గా గుర్తింపు పొందింది. తన కెరీర్‌లో ఎన్నో పతకాలను సాధిస్తూ స్టార్ రేసర్‌గా పేరొందింది. కానీ, 2017 నుంచి ఆమె పతనం ప్రారంభమైంది. విజయాలు వెనక్కి వెళ్లి.. పరాజయాలు పరిచయమయ్యి. ఫలితంగా గ్రేసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చివరికి ఓ కారు యార్డులో పనిచేయడం మొదలుపెట్టింది. కానీ, ఆ పని ఆమెకు సంతృప్తి కలిగించలేదు.

ఆ సమయంలో ఆమె ‘ఓన్లీఫ్యాన్స్’ అనే అడల్ట్ వైబ్‌సైట్ గురించి తెలుసుకుంది. అందులో అమ్మాయిలు తమ అందాలను ఆరబోస్తూ డబ్బులు సంపాదించడం చూసి ఆశ్చర్యపోయింది. న్యాయంగా డబ్బులు సంపాదించడం కష్టమని భావించింది. కష్టాలు తొలగిపోవాలంటే తెగించాలని నిర్ణయించుకుంది. గ్రేసీ తన అందాన్నే పెట్టుబడిగా పెట్టి.. కొత్త బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది.ఈ సందర్భంగా గ్రేసీ ఓ అడల్ట్ వెబ్‌సైట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తన నగ్న ఫొటోలు, వీడియోలను పంపడం మొదలుపెట్టింది. వారం రోజుల వ్యవధిలోనే ఆమె ఊహించనంత డబ్బు సంపాదించింది. దాదాపు రెండున్నర లక్షలు ఆమె అకౌంట్లోకి వచ్చిపడ్డాయి. అంతే, ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ డబ్బుతో తన అప్పులన్నీ తీర్చేసింది. ప్రస్తుతం తన వెబ్‌సైట్‌కు 7 వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఆమెకు వారానికి సుమారు 2,500 డాలర్లు (రూ.1.8 లక్షలు) సంపాదిస్తోంది.

 

 


 

 

 

Viral News Telugu, Popular News Telugu, News Telugu, Trending New’s Telugu