రాక్షసంగా మహిళపై గొడ్డలితో దాడి - Vanaparthi - Darsi Live News

రాక్షసంగా మహిళపై గొడ్డలితో దాడి - Vanaparthi - Darsi Live News

అతి తక్కువ ధరలో Computers ఆమ్మబడును సెల్ : +91 9700046190

రాక్షసంగా మహిళపై గొడ్డలితో దాడి ....

వనపర్తి : తెలంగాణ వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గోపాల్‌ పేట్‌ మండలంలోని బుద్ధారం గ్రామంలో ఒక వర్గంపై మరో వర్గం గొడ్డలితో దాడి చేసింది. అర్జున్‌రావు అనే వ్యక్తి రత్నమ్మ, అనంతరాములుపై గొడ్డలితో దాడి చేసిన దశ్యాలు అత్యంత భయకల్పితంగా ఉన్నాయి. రత్నమ్మపై గొడ్డలితో ఇష్టానుసారంగా దాడి చేశాడు. మెడపై పదే పదే నరకడం అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. కానీ కళ్ల ముందే అంత దారుణం జరుగుతున్నా అక్కడున్న జనాలు చూస్తూ మిన్నకుండిపోయారు తప్ప ఎవ్వరూ ఆ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ అర్జున్‌రావును ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి