అన్‌లాక్ 3.0 మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే - Unlock 3.0 - Darsi Live News

అన్‌లాక్ 3.0 మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే - Unlock 3.0 - Darsi Live News

అన్‌లాక్ 3.0 మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పరిశీలించి కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31 అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండటంతో కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అనుమతి : రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా ఎత్తేసింది. ఆగస్టు 5 నుంచి జిమ్ములు, యోగా సెంటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 5 నుంచి జిమ్ములు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్య్ర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అనుమతి లేనివి : ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని స్పష్టం చేసింది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు బంద్‌. ప్రస్తుతానికి స్పోర్ట్స్‌ టోర్నమెంట్లకు అనుమతి లేదు. సిమ్మింగ్‌ పూల్స్‌, బార్లకు అనుమతి లేదు. కంటోన్‌మెంట్‌ జోన్లలో ఆగస్టు 31 వరకు ఆంక్షలు కొనసాగతాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి