రేపు వైసీపీలోకి TDP మాజీ మంత్రి... శిద్ధా రాఘవరావు .. Darsi Live News

రేపు వైసీపీలోకి TDP మాజీ మంత్రి... శిద్ధా రాఘవరావు .. Darsi Live News

బుధవారం ఆయన కుమారుడు సుధీర్‌తో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ చేరికలు ఉంటాయని సమాచారం. చక్రం తిప్పిన జిల్లాకు చెందిన మంత్రి, మరో ఎమ్మెల్యే.

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన కుమారుడు సుధీర్‌తో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ చేరికలు ఉంటాయని సమాచారం. శిద్ధా రాఘవరావు అధికార పార్టీలో చేర్చేందుకు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనే రాఘవరావు పార్టీ మారతారని ప్రచారం జరిగింది.. ఆయన మాత్రం టీడీపీలో కొనసాగుతానని చెప్పారు. మళ్లీ ఇప్పుడు పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముందు ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత జగన్‌కు జైకొట్టారు.. ఆ పార్టీలో అధికారికంగా చేరకపోయినా సీఎంకు మద్దతు పలికారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నేత కదిరి బాబూరావు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇటీవల చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా అదే బాటలో నడిచారు.. తన కుమారుడ్ని జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేర్చారు. ఆయన కూడా జగన్‌కు మద్దతు పలికారు.

అంతేకాదు బలరాం కూడా త్వరలోనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వైఎస్సార్‌సీపీలో చేరతారని హింట్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోపే శిద్దా రాఘవరావు పార్టీ మారేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. గతంలో బలరాం, శిద్దాలు టీడీపీలో పనిచేశారు. ఆ పరిచయంతో బలరాం చర్చలు జరిపి అధికార పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.

శిద్దా రాఘవరావు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.. చంద్రబాబుకు సన్నిహిత నేతగా పేరుంది. ఒంగోలు నుంచి 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలోనే కొనసాగారు.. తర్వాత నియోజకవర్గం మార్చి దర్శికి వెళ్లారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి.. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

Raghava Rao, Telugu Desam Party Ongole, TDP Prakasam, Ongole Today News

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి